అభివృద్దిలో ఏపీని ప‌రుగులు పెట్టిస్తున్న సీఎం

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మంత్రి నారా లోకేష్

తిరుప‌తి : అన్ని రంగాల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ముందంజ‌లో ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అని ప్ర‌శంస‌లు కురిపించారు త‌న త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్. ఇండియా ఇప్పుడు చాలా ప్రభావవంతమైన స్థితిలో ఉందన్నారు. మన జనాభాలో దాదాపు 65% మంది 35 ఏళ్లలోపు వాళ్లే. ఈ యూత్ పవర్ మనకు పెద్ద స్ట్రెంత్ అవ్వొచ్చు లేదా పెద్ద ఛాలెంజ్ కూడా అవ్వొచ్చు అని పేర్కొన్నారు. ఒక యంగ్ పొలిటీషియన్ గా నాకు ఈ రెండింటి మీదా క్లారిటీ ఉందన్నారు. నాలాంటి యువ నాయకుల మీద ఈ బాధ్యత ఎంత ఉందో నాకు తెలుసు అని చెప్పారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో పాటు, నాకు చాలా టఫ్ బాస్ (ముఖ్యమంత్రి) ఉన్నారు. ఆయన మమ్మల్ని పరుగులు తీయిస్తున్నారంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

మా గోల్ చాలా క్లియర్ గా ఉంది. మీలో చాలామందికి నేను ఏపీ ఐటీ మినిస్టర్ గానే తెలుసు. అది నా ‘ఇండియా హ్యాట్’ అని. కానీ నాకు ఇంకా ఎక్కువ ఇష్టమైనది ఎడ్యుకేషన్ మినిస్టర్ డ్యూటీ.. అదే నా ‘భారత్ హ్యాట్’. నేను ఈ రాష్ట్రానికి హెచ్ఆర్డీ (HRD) మినిస్టర్ ని కూడా. మనుషుల స్కిల్స్ ని, టాలెంట్ ని బయటకు తీస్తేనే మనం చాలా అచీవ్ చేయగలం అని నేను గట్టిగా నమ్ముతానని చెప్పారు నారా లోకేష్‌. టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తుందన్నారు. అందులో డౌటే లేదు. కానీ ఆ టెక్నాలజీతో మార్పు తీసుకొచ్చే మనుషుల్ని తయారు చేసేది మాత్రం చదువేన‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. అందుకే మనం చేసే ఏ పనికైనా విద్య ప్రధాన కేంద్రంగా ఉండాల‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!