ఏపీ గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ రెడ్డికి లేదు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి ఎస్. స‌విత

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హ‌క్కు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేనే లేద‌న్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. జగన్ రెడ్డికి ఉన్న క్రెడిట్ ఏంటో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆ క్రెడిట్ ను చోరీ చేయాల్సిన దుస్థితి తమకు పట్టలేదని మంత్రి సవిత తెలిపారు. ప్రజా వేదికను కూల్చివేయడం, అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టడం, దోచుకోవడం ఇవే జగన్ క్రెడిట్ అని విమర్శించారు. అయిదేళ్లలో ఒక్క పరిశ్రమను జగన్ ఏర్పాటు చేయలేదన్నారు. జే ట్యాక్స్ పేరుతో ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారన్నారని ఆరోపించారు. ఏయే పరిశ్రమలు తీసుకొచ్చావో జగన్ చెప్పాలని తమ మంత్రి నారా లోకేశ్ ఎన్నో పర్యాయాలు కోరినా, వైసీపీ నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో ఒకవైపు పరిశ్రమలు ఏర్పాటు, మరోవైపు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం చంద్రబాబుకు వస్తున్న మంచిని చూసి జగన్ ఓర్వలేక పోతున్నారన్నారు.

ఒకరోజు శవ రాజకీయాలు, మరో రోజు డీఎస్సీ నిర్వహణపై ఆరోపణలు, ఇంకో రోజు మహిళల కట్టుబొట్టుపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎస్. స‌విత‌. 2018లోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారన్నారు. అంతకు ముందు స్టీల్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లను, హెలీ ప్యాడ్ ను జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పరిశీలించారు. సభకు పెద్ద ఎత్తున జనాలు తరలొచ్చే అవకాశముందని, ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగగుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!