2047నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే మా సంకల్పం

ఒక రాజకీయపార్టీగా మేం ఏఐని ఉపయోగిస్తున్నాం

శ్రీసిటీ (తిరుపతి): దేశ ఆర్థికాభివృద్ధిలో మన రాష్ట్రం ముందుండాలన్నదే మా ధ్యేయం. ప్రస్తుతం మనం 220 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీసిటీలో శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఇక్కడున్న వాళ్లందరికీ మా సీఎం గురించి తెలుసు అన్నారు. ఆయన ఒక కల కన్నారంటే, దాన్ని అచీవ్ చేసి తీరుతారని చెప్పారు. ఆయనకు పెద్ద విజన్ ఉంది, ఆ కల సాకారానికి మమ్మల్ని కూడా అదే స్పీడ్ లో పరుగెత్తిస్తున్నారని పేర్కొన్నారు లోకేష్. మన ప్రధాని నరేంద్ర మోదీ లాంటి గొప్ప విజనరీ లీడర్ షిప్ లో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) నుంచి స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, వికసిత్ భారత్ దాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు నారా లోకేష్‌.

మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా కొత్త మోడల్స్ తో రాష్ట్రాలు ముందుండి నడిపించాలని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ రోజుల్లో ఏదైనా ఒక రాష్ట్రం చేసి చూపిస్తే, మిగతా రాష్ట్రాలు వాళ్ళతో పోటీ పడతాయని ఆయనకు తెలుసు. మొన్న మేం ఈ ఇన్ స్టిట్యూట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన మెసేజ్ కూడా ఇదేన‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా
శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి . ఒక ఐడియాని తీసుకుని దాన్ని గ్రౌండ్ లెవల్ లోకి తెచ్చి నిజం చేసిన శ్రీని రాజు కి నా అభినందనలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి గొప్ప రాష్ట్రంలో ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ని కట్టినందుకు ఆయనకు నా ధన్యవాదాలు.

Leave A Reply

Your Email Id will not be published!