తిరుపతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి కొత్త మోడల్ ను తీసుకు రావడం జరిగిందన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రత్యేకించి శ్రీసిటీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు నేను చెప్పేది ఒకటేనని, ఏపీ గవర్నమెంట్ గా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకు రావడం మీద మాకు ఫుల్ క్లారిటీ ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే మన స్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని కలిసి, మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి మేం ఇప్పుడు అఫీషియల్ గా ఒక డెస్క్ ని క్రియేట్ చేశాం అని వెల్లడించారు. మీరు మీ బిజినెస్ ని పెంచుకుంటున్న కొద్దీ మీ అవసరాలు మారుతాయని గుర్తు పెట్టుకోవాలన్నారు. పవర్ రిక్వైర్మెంట్స్ మారుతాయన్నారు. ఏపీలో మీ బిజినెస్ ని పెంచుకోవడానికి మీకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికే ఈ డెస్క్. ఏపీకి పెట్టుబడులకు మావద్ద 3ఎస్ మోడల్ ఉందన్నారు.
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్. ఒకసారి మేం మీ ప్రాజెక్టుకి ఓకే చెప్పామంటే, అది ఇక మీ ప్రాజెక్ట్ కాదు, మాసొంతదిగా భావిస్తాం అని వెల్లడించారు నారా లోకేష్. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. ఈ ప్రాజెక్టును నేను క్లియర్ చేసినప్పుడు తాను రష్యాలో ఉన్నట్లు తెలిపారు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదన్నారు. ఫైల్ నా లాగిన్ కి రాగానే, నేను చదివాను. ఒక మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్ కు వెళ్తున్న గ్యాప్ లో ఈ ఫైల్ ను నేను క్లియర్ చేశాను. ఆ మూమెంట్ నాకు పక్కాగా గుర్తుందన్నారు. మా పార్ట్ నర్స్ అందరికీ మేం ఇచ్చే సర్వీస్ అదే.
ఇండియా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలదని నా నమ్మకం. దానికి ప్రైవేట్ సెక్టార్, పొలిటికల్ సిస్టమ్, అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్. మనమెవరమూ ఇండిపెండెంట్ కాదు, కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ ఇప్పటికే డబుల్ డిజిట్ గ్రోత్ తో దూసుకెళ్తున్న రాష్ట్రం. మేం ఇంకా ఫాస్ట్ గా అభివృద్ధి సాధిస్తాం, కానీ మాకు మీ అందరి మద్దతు కావాలని మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
