పరిశ్రమల ఏర్పాటుతో రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత ప్ర‌క‌ట‌న

కడ‌ప జిల్లా : రాయలసీమలో పరిశ్రమలు నెలకొల్పుతూ, ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు సీఎం చంద్రబాబు నాయుడు పునాదులు నిర్మిస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. జమ్మలమడుగులో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ తో యువతకు ఉపాధి లభించడమే కాకుండా ఈ ప్రాంత రూపురేఖలే మారనున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో సీఎం చంద్రబాబు నాయుడుకు వస్తున్న పేరు ప్రఖ్యాతలను చూసి, జగన్ రెడ్డి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని, ఆయనకున్న క్రెడిట్ ఏంటో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. జ

మ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లె వద్ద రూ.16,350 కోట్లతో చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణా చైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి, ఇతర కూటమి నేతలతో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడారు. రాయలసీమలోని అన్ని ప్రాంతాలను సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేయడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, కడప సహా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ, ఈ ప్రాంత యువతకు ఉజ్వల భవిష్యత్తు అందజేస్తున్నారన్నారు. జమ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లె వద్ద చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ తో వేలాది మందికి ఉపాధి లభించనుందని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌.

Leave A Reply

Your Email Id will not be published!