ఏపీలో మ‌ల్లారెడ్డి యూనివ‌ర్శిటీకి గ్రీన్ సిగ్న‌ల్

కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌న్న ఎమ్మెల్యే

అమ‌రావ‌తి : మాజీ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఈ మ‌ధ్య అటు కేంద్రంతో ఇటు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆయ‌న కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్ )గ‌తంలో మంత్రిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. త‌ను కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించ‌కుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ‘డీమ్డ్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింద‌ని మల్లారెడ్డి వెల్ల‌డించారు.

ఆంధ్రప్రదేశ్ , రాయలసీమ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా, తెలంగాణకు చెందిన ఒక విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాలను సందర్శించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా తెలంగాణలో అనేక పాఠశాలలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపించినట్లు ఆయన తెలిపారు. తన విద్యా సంస్థల ద్వారా ప్రపంచ స్థాయి వైద్యులు, ఇంజనీర్లు , ఫార్మసిస్టులు తయారయ్యారని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని తాను చాలా కాలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

తన పుట్టినరోజు సందర్భంగా ఆలయ నగరంలో కళాశాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పించమని దేవుడిని ప్రార్థించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే భూమిని సేకరించి, కళాశాల భవనాన్ని నిర్మించి, ప్రాంగణాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ , రాయలసీమ విద్యార్థులకు మేలు చేసేలా, తెలంగాణకు చెందిన విద్యా సంస్థ ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం సంతోషకరమని మల్లారెడ్డి అన్నారు. ఈ సంస్థ రేణిగుంట సమీపంలో ఉందని ఆయన తెలిపారు. ‘మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేంద్రం ఆమోద పత్రాన్ని జారీ చేసిందని ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your Email Id will not be published!