ముంబై : తెహల్కా ఎడిటర్ అండ్ ఫౌండర్ తరుణ్ తేజ్ పాల్ కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2013 నాటి లైంగిక దాడి కేసులో ముంబై హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ శిక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ‘తెహల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశానని పేర్కొన్నారు. 2013లో గోవాలో జరిగిన లైంగిక దాడి కేసులో తనపై నమోదైన నేర నిర్ధారణ, విధించిన 10 ఏళ్ల శిక్షను వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశానన్నార. బాంబే హైకోర్టు ఆగస్టు 6న ఇచ్చిన తీర్పుపై ఈ అప్పీల్‌ను న్యాయవాది ఆదిత్య సమద్దార్ ద్వారా దాఖలు చేశారు.
అంతకు ముందు ఈ కేసులో జీవిత ఖైదు విధించాల్సిన అవసరం ఉందని వాదిస్తూ ‘తెహల్కా’ మాజీ ఎడిటర్‌కు విధించిన శిక్షను పెంచాలని కోరుతూ గోవా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐదేళ్ల క్రితం ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి, హైకోర్టు అతన్ని అత్యాచార నేరంలో దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తేజ్‌పాల్ చేసిన నేరాల తీవ్రతతో పోలిస్తే హైకోర్టు విధించిన శిక్ష చాలా తక్కువగా ఉందని గోవా ప్రభుత్వం వాదించింది. గోవాలో ‘తెహల్కా’ మ్యాగజైన్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా 2013లో హోటల్ లిఫ్ట్ లోపల తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడినట్లు తేజ్‌పాల్‌పై నేరం రుజువైంది. తాను రాజకీయ కుట్రకు బాధితుడినని 62 ఏళ్ల తేజ్‌పాల్ వాదించారు.
