రామ్ చ‌ర‌ణ్ సుకుమార్ సినిమా ప్రారంభం

హాజ‌రైన మెగాస్టార్ చిరంజీవి, దిల్ రాజు

హైద‌రాబాద్ : మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో టాప్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చ‌ర‌ణ్ కీ రోల్ పోషించే నూత‌న సినిమా ప్రారంభ‌మైంది. నిర్మాత‌లు క్లాప్ కొట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు హాజ‌ర‌య్యారు. ఇక రామ్, సుక్కు కాంబోలో సినిమా రానుండ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రంగ‌స్థ‌లం మూవీ వ‌చ్చింది. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. పుష్ప -, పుష్ప‌-2 విడుద‌ల త‌ర్వాత సుకుమార్ చెర్రీతో సినిమా చేస్తుండ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా ఆర్సీ 17′ అని పిలుస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఘ‌నంగా పూజా కార్యక్రమం జ‌రిగింది. 2018లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రంగస్థలం’ తర్వాత, రామ్ చరణ్ మరియు సుకుమార్ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ పట్ల తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవి శంకర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. చిత్ర బృందం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంద‌ని పేర్కొన్నారు. ఇక మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం సంగీత విభాగం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే సుకుమార్ , అనిరుధ్ కలిసి పనిచేసే కొత్త కలయికగా ఇది నిలుస్తుంది. గతంలో సుకుమార్ తన విజయవంతమైన చిత్రాలకు ‘రంగస్థలం’ ‘పుష్ప’ సిరీస్‌తో సహా—దేవి శ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేశారు. కాగా సంగీత దర్శకుడి విషయంలో చిత్ర బృందం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Leave A Reply

Your Email Id will not be published!