Twinkle Khanna : విల్ స్మిత్ భారత్ నుంచి నేర్చుకున్నాడా
క్రిస్ రాక్ చెంప దెబ్బపై ఆసక్తికర వ్యాఖ్యలు
Twinkle Khanna : ప్రపంచంలోనే పేరొందిన అద్బుత నటుడు విల్ స్మిత్ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రవర్తించిన తీరు ఆశ్చర్య పోయేలా చేసింది సమస్త లోకాన్ని. ఆయన ఎన్నో ఇబ్బందులను అధిగమించి గొప్ప నటుడిగా, వక్తగా, వ్యక్తిగా పేరొందారు.
విల్ స్మిత్ భారత దేశాన్ని సందర్శించారు. ఆ సందర్బంగా ప్రముఖ సెలబ్రిటీలు సైతం విల్ స్మిత్ తో కరచాలనం చేశారు. ఆయనతో సంభాషించారు. అందులో ప్రముఖ నటి అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna) ఒకరు.
ఆమె గతంలో ఎన్నో సినిమాలలో నటించారు. ఆ తర్వాత పూర్తి కాలపు కాలమిస్ట్ గా, రచయిత్రిగా మారారు. ఈ సందర్భంగా విల్ స్మిత్ ప్రవర్తించిన తీరు పట్ల స్పందించారు.
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన ప్రవృత్తి ఆయనలో తనకు ఎక్కడా కనిపించ లేదన్నారు. ఒక రకంగా ఈ చెంప దెబ్బ పాఠాన్ని భారత్ నుంచి విల్ స్మిత్ ఏమైనా నేర్చుకున్నాడా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది.
ఇలా జరుగుతుందని ఆయన ఇలా చేస్తారని తాను కలలో కూడా అనుకోలేదన్నారు ట్వింకిల్ ఖన్నా. అయితే వివాదాస్పద అంశాలపై తన అభిప్రాయాలను వినిపించేందుకు ఆమె ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు.
ఎక్కడా తగ్గరు. ఇదిలా ఉండగా 2019లో విల్ స్మిత్ భారత దేశాన్ని సందర్శించారు. కరణ్ జోహార్ స్టూడెంట్స్ ఆఫ్ ఇయర్ -2 లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరించారు.
అయితే విల్ స్మిత్ ఏమైనా చెంప దెబ్బను భారత్ నుంచి నేర్చుకున్నాడా అన్న అనుమానం వ్యక్తం చేసింది..
Also Read : ‘నిహారిక’ నిప్పు ఏ తప్పు చేయలేదు