Salman Khan : స‌ల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ

చంపేస్తామంటూ తండ్రికి కూడా

Salman Khan : ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ కొంద‌రు దుండ‌గులు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఆదివారం ఈ విష‌యం గురించి క్లారిటీ ఇచ్చారు న‌టుడు.

స‌ల్మాన్ ఖాన్(Salman Khan) తో పాటు అత‌డి తండ్రి స‌లీమ్ ను కూడా చంపుతామంటూ లేఖ పంపించార‌ని తెలిపారు. పంజాబ్ సింగ‌ర్ సిద్దూ మూసే వాలాకు ప‌ట్టిన గ‌తే నీకు ప‌డుతుందంటూ ఆ లేఖ‌లో తీవ్రంగా హెచ్చ‌రించారు.

దీంతో ఈ బెదిరింపు లేఖ బాలీవుడ్ లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. లేఖ దెబ్బ‌కు న‌టుడు స‌ల్మాన్ ఖాన్ , తండ్రి స‌లీమ్ ముందే అప్ర‌మ‌త్తం అయ్యారు. ఈ మేర‌కు హుటా హుటిన స‌ల్మాన్ ఖాన్ బాంద్రా పోలీసుల‌కు స్వ‌యంగా ఫిర్యాదు చేశారు.

దీనిపై వెంట‌నే స్పందించిన పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ మేర‌కు దుండ‌గులు పంపించిన లేఖ ఆధారంగా ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ లేఖ ఎవ‌రు రాశారు. ఎక్క‌డి నుంచి వ‌చ్చింది అనే కోణంలో విచార‌ణ చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇలాంటి బెదిరింపు లేఖ రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలోనూ స‌ల్మాన్ ఖాన్(Salman Khan) ను చంపేస్తామంటూ బెదిరింపులు అనేకం వ‌చ్చాయి.

కాగా తాజాగా పంజాబ్ జిల్లా మాన్సా లో కాల్పుల‌కు గురైన సిద్దూ కేసులో కీల‌క అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు స‌ల్మాన్ ఖాన్ ను.

బిష్ణోయ్ కి కృష్ణ జింక అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. దానిని లారెన్స్ దైవంగా ఆరాధిస్తాడు. జింక వేట కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న స‌ల్మాన్ ఖాన్ ను కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే చంపేస్తానంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు ఈ గ్యాంగ్ స్ట‌ర్.

ఈ త‌రుణంలో ఈ లేఖ రావ‌డం క‌ల‌కలం రేపింది. ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

Also Read : ‘లోకేష క‌మ‌ల్’ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!