Brahmam Chowdary Nadendla: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంకు తీవ్రగాయాలు !

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంకు తీవ్రగాయాలు !

Brahmam Chowdary Nadendla: బాపట్ల జిల్లా అద్దంకి-రేణింగివరం మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి ఇటుక లోడుతో రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని బ్రహ్మంచౌదరి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బ్రహ్మం చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తొలుత బ్రహ్మంను ఒంగోలు కిమ్స్‌లో చేర్పించినప్పటికీ మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించనున్నారు.

Brahmam Chowdary Nadendla – రోడ్డు ప్రమాదంపై నారా లోకేశ్ విచారం !

నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంలో గాయపడటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వైద్యులతో మాట్లాడిన నారా లోకేశ్‌… అవసరమైన చికిత్సలు అందించాలని సూచించారు. బ్రహ్మంకు టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Also Read : Nallimilli Rama Krishna Reddy: అనపర్తిపై వీడిన చిక్కుముడి ! బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి !

Leave A Reply

Your Email Id will not be published!