Nallimilli Rama Krishna Reddy: అనపర్తిపై వీడిన చిక్కుముడి ! బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి !

అనపర్తిపై వీడిన చిక్కుముడి ! బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి !

Nallimilli Rama Krishna Reddy: అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్ధిపై చిక్కుముడి వీడినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి… బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. తొలుత తాను టీడీపీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పట్టుపట్టారు. అయితే పొత్తుల్లో భాగంగా అనపర్తి సీటును బీజేపీకు కేటాయించాల్సి వచ్చింది. దీనితో రామకృష్ణారెడ్డి వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. దీనితో నష్ట నివారణా చర్యల్లో భాగంగా నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. నల్లమిల్లి తొలుత విముఖత వ్యక్తం చేయడంతో… చంద్రబాబు నేరుగా రంగంలోనికి దిగి… రామకృష్ణారెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Nallimilli Rama Krishna Reddy Joined in..

ఆ తరువాత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నల్లమిల్లి ఇంటికి పంపించి నారా లోకేష్ తో కూడా మాట్లాడించారు. దీనితో బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు కలిసి రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లి… బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇలా చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు మాట్లాడటంతో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించారు. ఒకటి రెండు రోజుల్లో నల్లమిల్లి బీజేపీలో చేరనున్నారు. అనంతరం బీజేపీ బీఫామ్ తీసుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దాదాపు నెల రోజులుగా అనపర్తి సీటుపై నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనున్నాయి.

Also Read : Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పై ఐఆర్డిఏఐ కీలక నిర్ణయాలు !

Leave A Reply

Your Email Id will not be published!