Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌ ను ముంచెత్తుతున్న వరదలు ! రెడ్‌ అలర్ట్‌ జారీ !

హిమాచల్‌ ప్రదేశ్‌ ను ముంచెత్తుతున్న వరదలు ! రెడ్‌ అలర్ట్‌ జారీ !

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం… మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో (Himachal Pradesh) ఒక్క రోజులో 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అతి తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది.

Himachal Pradesh – రెడ్‌ అలర్ట్‌ జారీ

హిమాచల్‌ ప్రదేశ్‌ లోని కంగ్రా, సిర్మూర్‌, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్‌ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్‌పుర్‌, హమిర్‌పుర్‌, చంబా, శిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. ఐటీబీపీ దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. దీనికి తోడు బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ సాయం తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ ప్రభుత్వానికి సూచించారు.

Also Read : Giri Pradakshina: సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల‌పై స‌మీక్షించిన జిల్లా క‌లెక్ట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!