KCR Comment : కేసీఆర్ కిం కర్తవ్యం
గులాబీ నేతల్లో గుబులు
KCR Comment : కాలం ఎవరినీ ఊరికే వదలదు. చరిత్ర ఇంకెవరినీ క్షమించదు. ఇప్పుడు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్(BRS) బాస్ , మాజీ సీఎం కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా ప్రసిద్ది చెందిన తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నా, తెలంగాణ గాంధీగా పేరు పొందినా చివరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఫామ్ హౌస్ కు వెళ్లి పోవడం విస్తు పోయేలా చేసింది. తన మాటలతో మంటలు రేపిన వాడు. తన తెలివి తేటలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన కేసీఆర్(KCR) ఇవాళ బేళగా , మౌనంగా ఉండడం ఆశ్చర్యం వేయక మానదు. ప్రజలను కేవలం సంక్షేమ పథకాల లబ్దిదారులుగా, బానిసలుగా చూడడం కొంప ముంచేలా చేసింది.
అంతకు మించి ఒంటెద్దు పోకడ, అహంకారం అపజయానికి కారణమైంది. కేసీఆర్ అంటే ఓ ఉప్పెన, ఓ ఉద్రేకం, ఓ ఉత్తుంగ తరంగం, ఓ కెరటం. కానీ ఇప్పుడు ఆ జోష్ లేకుండా పోయింది. ఆ తీవ్రత మాటల నుంచి వేరైంది. ఒకసారి వెనక్కి చూసుకుంటే తనకు నిన్నటి దాకా సలాం కొట్టిన వాళ్లు ఇప్పుడు ఎవరూ లేరు. తన ద్వారా కోట్లకు పడగలు ఎత్తిన వాళ్లు, అవినీతి, అక్రమాలతో అంట కాగిన వాళ్లు మాత్రమే బిక్కు బిక్కుమంటూ ఉన్నారు.
KCR Comment Viral
తనంతకు తానుగా రాజునని, నయా నవాబునని , తాను మేధావినని , తనకు ఎదురే లేదని, ఏది చేసినా నడుస్తుందని భావించారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరినీ తక్కువ చేసి చూడడం ప్రారంభించారు. అప్పటి నుంచి తను ప్రజలకు దూరమై పోయారు. చివరకు తాను ఒంటరి వాడై పోయాడు. చుట్టూ జనం ఉన్నా ఇప్పుడు ఒంటరిగా బయటకు రాలేని స్థితి. గులాబీ నేతలలో గుబులు రేగుతోంది. బయటకు ఎన్ని బీరాలు పలికినా చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. మోసాలు బట్ట బయలు అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. తాయిలాల ద్వారా, నోట్ల కట్టలను కోట్లకొద్దీ కురిపిస్తే, మద్యాన్ని ఏరులై పారిస్తే ఓట్లు రాలుతాయని కేసీఆర్(KCR) భావించారు. ఆయనకు తగ్గట్టుగానే తన పరివారం నడిచింది. చివరకు బొక్క బోర్లా పడింది. ఉద్యమ పార్టీ పేరును మార్చి, దేశమంతటా జెండా ఎగుర వేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇవాళ తను ఏరికోరి ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ లో బందీ అయి పోయారు.
తను 80 వేల పుస్తకాలు చదివి ఉండవచ్చు. లేదా అంతకు మించిన పరిజ్ఞానం ఉండవచ్చు. ఏ ప్రజలైతే ఉద్యమ కాలంలో తన వెంట నడిచారో ఆ సంబండ వర్గాలే ఇవాళ కేసీఆర్ ను వద్దనుకున్నాయి. ఓటమి అంటే జీర్ణించు కోలేని ఆయనకు కామారెడ్డి రూపంలో చేదు అనుభవం మిగిలింది. గజ్వేల్ లో గెలిచినా అది ఓ అదృష్టం మాత్రమే. తాను ఎవరినైతే చులకన చేసి చూశాడో, ఈసడించుకున్నాడో వారికే తన రాజీనామా పత్రాన్ని సమర్పించాల్సి రావడం ఒక రకంగా ప్రజలు విధించిన శిక్షగా అనుకోక తప్పదు.
తన పార్టీకి 39 సీట్లు కట్టబెట్టినా వారంతా తన వద్ద ఉంటారని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నీవు నేర్పిన విద్యనే కదా. కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు, కొనుగోళ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేయవని తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే అన్ని కాలాలు మన వైపు ఉండవు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. పవర్ లేకుండా ఏ క్షణాన్ని భరించ లేని కేసీఆర్ ఊరికే ఉంటాడని అనుకోవడానికి వీలు లేదు..కానీ చరిత్ర డేగ కన్నుతో చూస్తూ ఉంటుందని తెలుసుకోవాలి. అది సీసీ కెమెరాల కంటే ప్రమాద కరంగా ఉంటుందని గుర్తిస్తే బెటర్.
Also Read : Revanth Reddy Comment : మామూలోడు కాదు బుల్లెట్ లాంటోడు