కేంద్ర స‌ర్కార్ కు బిగ్ షాక్,,వీగి పోయిన స‌వ‌ర‌ణ బిల్లు

ప్ర‌ధాని మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షాకు ఝ‌ల‌క్

న్యూఢిల్లీ : భార‌త దేశ రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేస్తూ , ప్ర‌జాస్వామ్యానికి పాత‌ర వేస్తూ కుట్ర‌ల‌కు తెర లేపిన బీజేపీ కేంద్ర స‌ర్కార్ కు, ప్ర‌ధాని మోదీ, హొం శాఖ అమిత్ షాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. తాజాగా భార‌త రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ చేప‌ట్టేందుకు ఉద్దేశించిన డీ లిమిటేష‌న్ బిల్లును ప్ర‌వేశ పెట్టింది. విప‌క్షాల‌న్నీ ఏక‌ప‌క్షంగా ఉండ‌డంతో కోలుకోలేని దెబ్బ త‌గిలింది. లోక్ స‌భ‌లో బిల్లు వీగి పోయింది 131 రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు. దీంతో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ చ‌ట్టానికి కూడా బ్రేక్ ప‌డిన‌ట్ల‌యింది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ పెట్ట‌గా మొత్తం 528 ఓట్లు పోల్ అయ్యాయి. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్య‌తిరేకంగా 230 ఓట్లు వ‌చ్చాయి. దీంతో దెబ్బ‌కు డీలిమిటేష‌న్, కేంద్ర పాలిత ప్రాంతాల స‌వ‌ర‌ణ బిల్లుల‌ను కూడా ఉప‌హ‌రించు కుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు స్పీక‌ర్ ఓం బిర్లా.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల పేరుతో డీ లిమిటేష‌న్ బిల్లును తీసుకు రావాల‌ని కుట్ర‌కు తెర లేపారు మోదీ, అమిత్ షా. దెబ్బ‌కు దిమ్మ తిరిగేలా చేశారు విప‌క్షాలు. ఇదే క్ర‌మంలో 2029 నుంచి మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా అమలు చేసేందుకు తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగి పోవ‌డంతో ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు షా, మోదీ. ముఖ్య‌మైన చ‌ట్టం తీసుకు వ‌చ్చే ముందు అన్ని పార్టీల స‌భ్యుల‌తో చ‌ర్చించాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండానే బిల్లును లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ప్ర‌తిప‌క్షాలు కొట్టిన దెబ్బ‌కు దిమ్మ తిరిగింది. మిగ‌తా బిల్లులు తీసుకు రావ‌డం లేదంటూ ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌లేదు. డీ లిమిటేష‌న్ బిల్లు వీగి పోవ‌డ‌తో యూటీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంత్రి రిజిజు.

Leave A Reply

Your Email Id will not be published!