Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ‘ఈసీ’ ఎదుట దీక్ష చేస్తా – మమతా బెనర్జీ

రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ‘ఈసీ’ ఎదుట దీక్ష చేస్తా - మమతా బెనర్జీ

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఎదుట తాను నిరాహార దీక్ష చేపడతానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీపుర్‌ దువార్‌ లో ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న దీదీ ఈసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee Comment

బీజేపీ ఆదేశాలమేరకు ముర్షిదాబాద్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ను ఈసీ తొలగించిందని ఆరోపించారు. ‘‘భాజపా ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోంది. అందుకే ముర్షిదాబాద్‌ డీఐజీని తొలగించింది. అలర్లు, హింసను ప్రేరేపించేందుకు కాషాయం పార్టీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ముర్షిదాబాద్‌, మాల్దాలో అలర్లు జరిగినట్లయితే దానికి ఈసీ బాధ్యత వహించాల్సిందే. అవసరమైతే ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరాహార దీక్షకు నేను సిద్ధం’’ అని దీదీ వ్యాఖ్యానించారు.

జైల్లో ఉన్న ప్రతిపక్ష నేతలను బీజేపీ బెదిరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘‘మీకు ఎన్ని కారాగారాలు, ఎంతమంది పోలీసులు అనుకూలంగా ఉన్నారో నేనూ చూస్తాను. మీరు ఎంతమందిని బాధించగలరు ? నాపై చాలాసార్లు దాడి జరిగింది. ఎలా పోరాడాలో నాకు బాగా తెలుసు’’ అని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌లో ఐటీ సోదాలు నిర్వహించడంపై ఆమె స్పందించారు. ధైర్యముంటే బీజేపీ నాయకులు ప్రచారానికి తిరుగుతున్న హెలికాఫ్టర్లలో సోదాలు నిర్వహించగలరా అని ఐటీకి సవాల్‌ విసిరారు.

Also Read : PM Narendra Modi: ఎలక్టోరల్‌ బాండ్ల రద్దుపై మోదీ కీలక వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!