Priyanka Chaturvedi : ఖాకీల తీరుపై ప్రియాంక కన్నెర్ర‌

శివ‌సేన ఎంపీ షాకింగ్ కామెంట్స్

Priyanka Chaturvedi : భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ను తొల‌గించాల‌ని కోరుతూ మ‌హిళా రెజ్ల‌ర్లు చేప‌ట్టిన ఆందోళ‌న ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా గ‌త ఏప్రిల్ 23 నుంచి నిరాటంకంగా నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. వీరి దీక్ష‌కు ప్ర‌తిపక్షాల‌తో పాటు సంయుక్త కిసాన్ మోర్చా మ‌ద్ద‌తు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మే 28న ఆదివారం నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా త‌మ నిర‌స‌న‌ను శాంత‌యుతంగా తెలియ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు మ‌హిళా రెజ్ల‌ర్లు.

పార్ల‌మెంట్ దాకా మార్చ్ చేపట్టేందుకు ప్ర‌య‌త్నించిన వారిపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీనిని తీవ్రంగా ఖండించారు శివ‌సేన యూబీటీ పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది. భార‌త అగ్ర శ్రేణి రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ రోడ్డుపై ప‌డి ఉన్న సోద‌రి సంగీత ఫోగట్ ను ప‌ట్టుకున్న వైనాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ దేశంలో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయం ఏమిటో ఇవాళ దేశానికి తెలిసింద‌న్నారు. ఈ చ‌ర్య‌తో మోదీ ప్ర‌భుత్వం సిగ్గుతో త‌ల దించు కోవాల‌న్నారు ప్రియాంక చ‌తుర్వేది(Priyanka Chaturvedi).

లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను ఎందుకు ర‌క్షిస్తున్నారో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు. ఈ దేశం మిమ్మ‌ల్ని క్ష‌మించ‌ద‌ని , ఏదో ఒక రోజు బ‌దులు తీర్చుకుంటుంద‌ని హెచ్చ‌రించారు ప్రియాంక చ‌తుర్వేది.

Also Read : Ashok Gehlot

Leave A Reply

Your Email Id will not be published!