Ashok Gehlot : ప్రారంభోత్సవ‌ బ‌హిష్క‌ర‌ణ స‌బ‌బే – సీఎం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై కామెంట్స్

Ashok Gehlot : రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మే 28న ఆదివారం నూత‌నంగా నిర్మించిన నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని ప్రారంభించారు పీఎం. ఈ సంద‌ర్బంగా దాదాపు 20కి పైగా ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని బ‌హిష్క‌రించాయి. ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్యాన్ని తుంగ‌లో తొక్క‌డ‌మేన‌ని, రాజ్యాంగాన్ని అవ‌మాన ప‌ర్చ‌డ‌మేన‌ని పేర్కొన్నారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).

ఆదివారం సీఎం సీరియ‌స్ గా స్పందించారు. నాగౌర్ లో మీడియాతో మాట్లాడారు. న‌రేంద్ర మోదీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాలు బ‌హిష్క‌రించాల‌ని తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్ర‌ధాని మోదీకి, భార‌తీయ జ‌న‌తా పార్టీకి, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు అశోక్ గెహ్లాట్.

ప్ర‌జాస్వామ్యంలో ప్రాముఖ్య‌త క‌లిగిన 20 పార్టీలు బ‌ల‌వంతంగా బ‌హిష్క‌రించాల్సి వ‌చ్చింది. దీన్ని బ‌ట్టి దేశానికి, ప్ర‌పంచానికి ఎలాంటి సందేశం పంపిందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. దీన్ని ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో అంగీక‌రించ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

“ప్రజాస్వామ్యంలో ప్రాముఖ్యత కలిగిన 20 పార్టీలు బలవంతంగా (కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం) బహిష్కరించవలసి వచ్చింది. దీన్ని బట్టి దేశానికి, ప్రపంచానికి ఎలాంటి సందేశం పంపిందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని ప్రజలు అంగీకరించరు. రాబోయే కాలంలో పార్టీ (బిజెపి) & ప్రధానమంత్రికి ఇబ్బంది ఉంటుంది” అని ముఖ్యమంత్రి నాగౌర్‌లో విలేకరులతో అన్నారు.

Also Read : Opposition Meet

Leave A Reply

Your Email Id will not be published!