కేంద్రంతో రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేదు : సీఎం

పోరాడేందుకు సిద్దంగా ఉన్నాన‌న్న రేవంత్

బెంగ‌ళూరు : రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎంతకైనా కేంద్రంతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టంచారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మా ద‌గ్గ‌ర పెట్టుబ‌డుల‌కు అనుమ‌తులు ఇచ్చే విష‌యంలో వాళ్లు గుజ‌రాత్ వెళ్లి పెట్టుబ‌డులు పెట్ట‌మంటున్నార‌ని , దీనిని మేం ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు. పెట్టుబ‌డుల సాధ‌న విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో స్నేహ పూర్వ‌క మ్యాచ్ ఆడతాం అని ప్ర‌క‌టించారు. భార‌తీయ సంస్కృతి మ‌తం గురించి అన్ని నేర్పుతుంద‌ని చెప్పారు. హైడ్రా మోడ‌ల్ అంద‌రికీ అవ‌స‌రం అని నేను అనుకోవ‌డం లేద‌న్నారు. ఎం6 మోడ‌ల్ అవ‌స‌రం అని పేర్కొన్నారు సీఎం. మ‌హా న‌గ‌రాలైన ఢిల్లీ, ముంబ‌యి, కోల్‌క‌తా, చెన్నై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్ ఆరు మ‌హా న‌గ‌రాలు.. ఆయా న‌గ‌రాల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించి వాటి సొంత మోడ‌ల్‌ను అనుస‌రించాలని స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణం, నీటి కొర‌త‌, ఫ్లాష్ ఫ్ల‌డ్స్‌పై సొంత మోడ‌ళ్ల‌ను అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం.

మ‌హిళా రిజ‌ర్వేషన్ల ర‌చ‌యిత‌లం మేమే.. ఇందిరాగాంధీ ఉక్కు మ‌హిళ‌.. ఆమె ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పాకిస్థాన్ ను ఓడించారు. పాకిస్థాన్‌ను విడదీసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ నాయ‌క‌త్వంలోనే ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయి. మ‌హిళా రాష్ట్రప‌తి, లోక్‌స‌భ స్పీక‌ర్‌, గ‌వ‌ర్న‌ర్లు, ముఖ్య‌మంత్రులుగా మ‌హిళ‌ల‌ను చేశారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థ‌ల్లో మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించారు. సోనియా గాంధీ నాయ‌క‌త్వంలోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును రాజ్య‌స‌భ‌లో ఆమోదించాం. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల పేరుతో రాజ‌కీయ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. పార్ల‌మెంట్ సీట్ల పెంపును మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుతో ముడిపెట్ట‌డాన్ని మేం వ్య‌తిరేకిస్తున్నాం అన్నారు సీఎం. వాళ్లు చెప్పిన‌ట్లు పార్ల‌మెంట్ సీట్లు పెంచితే కేర‌ళలో లోక్‌స‌భ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 80 నుంచి120 సీట్ల‌కు పెరుగుతాయని అన్నారు. ఇది స‌రైంది కాదు.. దీనినే మేం వ్య‌తిరేకిస్తున్నాం. ప‌ని చేసే ద‌క్షిణాది రాష్ట్రాల‌ను శిక్షించ‌వ‌ద్ద‌ని మేం కోరుతున్నాం అని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!