Pawan Kalyan : జ‌గ‌న్ లో ఓట‌మి భ‌యం

జ‌న‌సేన పార్టీ కామెంట్

Pawan Kalyan : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అరాచ‌క పాల‌న సాగిస్తున్న వైసీపీ చీఫ్‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న లో రోజు రోజుకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంటోంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాసన స‌భ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Pawan Kalyan Comments on Jagan

జ‌న‌సేన పార్టీకి చెందిన ఆయా జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. వేర్వేరుగా వారితో చ‌ర్చించారు. రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా అధికార పార్టీ ఎక్క‌డ విఫ‌ల‌మైందో జ‌నాన్ని చైత‌న్య‌వంతం చేసే దిశ‌గా కృషి చేయాల‌ని పేర్కొన్నారు జ‌న‌సేన పార్టీ చీఫ్.

ఇప్ప‌టికే రాష్ట్రంలో పూర్తి వ్య‌తిరేక‌త ఉంద‌ని, ప్ర‌జ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని భ‌రించే ప‌రిస్థితిలో లేర‌న్నారు. సాగ‌నంప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). నాలుగున్న‌ర ఏళ్ల‌లో చేసిన ప‌నుల గురించి చెప్పుకునేందుకు ఏమీ లేక వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

Also Read : AP CM YS Jagan : పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య

Leave A Reply

Your Email Id will not be published!