Priyanka Chopra : నిర్మాత నా లో దుస్తులు చూడాలన్నాడు
ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
Priyanka Chopra : ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) సంచలన కామెంట్స్ చేశారు. ఒక బాలీవుడ్ చిత్ర నిర్మాత తన లో దుస్తులను ఎలా చూడాల్సి వచ్చిందో గుర్తు చేసుకున్నారు. ఇది అత్యంత దారుణమైన ఘటనగా ఆమె అభివర్ణించింది. ఆనాటి ఆ ఘటనతో తాను షాక్ కు గురైనట్లు వాపోయింది. బుధవారం ప్రియాంక చోప్రా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ ఘటన 20 ఏళ్ల కిందట జరిగిందని వాపోయింది నటి. ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక చిత్ర నిర్మాత నా లోదుస్తులను చూడాలని అడిగాడని తెలిపింది. ఇందులో అండర్ కవర్ పాత్రను పోషించారు. ఇది మానవీయత లేని లక్షణంగా పేర్కొంది. దీంతో సదరు చిత్ర నిర్మాత ఆ లో దుస్తుల గురించి అడగడంతో తాను తీవ్ర మానసిక క్షోభను అనుభవించానని వాపోయింది. తట్టుకోలేక తాను ఆ సినిమా నుండి తప్పుకున్నానని చెప్పింది ప్రియాంక చోప్రా.
ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా 2002లో తమిజన్ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె మొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఎస్సై . ఇది 2003లో వచ్చింది. అదే ఏడాది అందాజ్ చేసింది. 2004లో ముజ్ సే షాదీ కరోగీ , ఐత్రాజ్ చేసింది. 2006లో డాన్ , 2008లో ఫ్యాషన్ , 2012లో బర్ఫీ, 2014లో మేరీ కోమ్ , 2015లో బాజీరావ్ మస్తానీ , 2019లో దది స్కై ఈజ్ పింక్ సినిమాలో నటించింది. 2021లో ది వైట్ టైగర్ లో నటించింది.
ఇక 2017లో బే వాచ్ , 2019లో ఈజ్ నాట్ ఇట్ రోమాంటిక్ , 2021లో ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ వంటి హాలీవుడ్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం నటి ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Boycott New Parliament
