Boycott New Parliament : పార్ల‌మెంట్ ప్రారంభోత్సం బ‌హిష్క‌ర‌ణ‌

ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసిన నిర్ణయం

Boycott New Parliament : విప‌క్షాలు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాయి. కొత్త‌గా(New) పున‌ర్ నిర్మించిన పార్ల‌మెంట్(Parliament) భ‌వ‌న ప్రారోంభోత్స‌వాన్ని తాము బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు(Boycott) వెల్ల‌డించాయి. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము లేకుండా కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు పట్టాయి. దీనిని సీరియ‌స్ గా ఖండించాయి. ఆదివారం కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని ప్ర‌ధాని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం మోదీ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించిన పార్టీల‌లో కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) , టీఎంసీ, డీఎంకే, వామ‌ప‌క్షాలు, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ , జ‌న‌తా ద‌ళ్ యునైటెడ్, ఎన్సీపీ , స‌మాజ్ వాదీ పార్టీ, శివ‌సేన యూబీటీ పార్టీలు ఉన్నాయి.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్నాయి సార్వ‌త్రిక ఎన్నిక‌లు. పార్ల‌మెంట్ కు చీఫ్ దేశ రాష్ట్ర‌ప‌తి. కానీ ఆమెను కాకుండా ప్ర‌ధాని అంతా తానై వ్య‌వ‌హ‌రించడాన్ని తీవ్రంగా ఖండించాయి. ప్ర‌ధాని ఒంటెద్దు పోక‌డ పోతున్నార‌ని, త‌న ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించాయి. రాచ‌రిక పాల‌న సాగిస్తూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న కేంద్ర స‌ర్కార్ తీరును తీవ్రంగా ఖండించాయి.

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌డం అంటే ప్ర‌జాస్వామ్యాన్ని కాల రాయ‌డ‌మే. దీనికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నాయి. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాయి విప‌క్షాలు. పార్ల‌మెంట్ ను నిర్దాక్షిణ్యంగా తూట్లు పొడిచిన ప్ర‌ధానికి అప్ర‌జాస్వామిక చ‌ర్య‌లు కొత్త కాద‌ని పేర్కొన్నాయి. ఇదిలా ఉండ‌గా తాము ప్ర‌తి ఒక్క‌రినీ ఆహ్వానించామ‌ని కానీ రాక పోతే తాము ఏమీ చేయ‌లేమ‌న్నారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.

Also Read : Covid19

 

Leave A Reply

Your Email Id will not be published!