Covid19 : కరోనా మహమ్మారి మరోసారి ఇబ్బందులకు గురి చేస్తోంది. గత కొంత కాలం నుంచి తగ్గుతూ వచ్చినా ఆ తర్వాత కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర సర్కార్ కరోనా(Covid) నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కేసులు తగ్గుతూ పెరుతున్నాయి.
భారత దేశంలో గడిచిన 24 గంటల్లో 552 కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 6 మరణాలు నమోదయ్యాయి. ఈ ఆరు మరణాలతో ఇప్పటి దాకా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,31,849కి చేరుకుంది. ఇందులో కేరళలలో తాజాగా కేసుల మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లకు పెరిగింది. సంఖ్యా పరంగా చూస్తే 4,49,87,891 గా నమోదైంది. క్రియా శీల కేసులు 7,104 నుండి 6,591కి తగ్గాయి. బుధవారం నవీకరించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కరోనా కేసుల సంఖ్య పెరగడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.01 శాతంగా ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read : Siddaramaiah
