Siddaramaiah : గూండాయిజం..మాఫియాను సహించం
కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన కామెంట్స్
Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి గూండాయిజం, డ్రగ్ మాఫియాను ఎట్టి పరిస్థితుత్లోనూ సహించ బోమంటూ హెచ్చరించారు. ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించ బోమంటూ స్పష్టం చేశారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సీఎం వెల్లడించారు.
ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విధానసౌధ సమావేశ మందిరంలో సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ తో సమీక్ష చేపట్టారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వాటిని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సిద్దరామయ్య. ప్రజలు మార్పును కోరుకున్నారని, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని వారి సమస్యలు ఏమిటో గుర్తించాలని, ఉన్నతాధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు సీఎం.
ప్రధానంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తోందని, దీనిపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళన కలిగించే , రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దరామయ్య ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు. సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు తరచుగా పోలీస్ స్టేషన్లను సందర్శించాలని, తనిఖీలు చేపట్టాలన్నారు సీఎం. లా అండ్ ఆర్డర్ క్షీణిస్తే మీరే బాధ్యులవుతారని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Mallu Bhatti Vikramarka
