MK Stalin : సింగ‌పూర్ తో దీర్ఘ‌కాలిక బంధం – స్టాలిన్

పెట్టుబ‌డుల‌కు త‌మిళ‌నాడు స్వ‌ర్గ‌ధామం

MK Stalin : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో అత్యంత సుర‌క్షిత‌మైన ప్రాంతం త‌మిళ‌నాడు అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప‌లు కంపెనీలు, పారిశ్రామికవేత్త‌లు, వ్యాపార‌వేత్తలు, పెట్టుబ‌డిదారులు ఎప్పుడైనా రావ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా సింగ‌పూర్ లోని ప్ర‌ధాన ఆర్థిక , పారిశ్రామిక సంస్థ‌ల అధిప‌తుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

టెమాసెక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సిఇఓ) దిల్హాన్ పిళ్లే సంద్ర సెగ‌ర‌, సెంబ్ కార్ప్ కు చెందిన కిమ్ యిన్ వాంగ్ , క్యాపిటాల్యాండ్ కు చెందిన సంజీవ్ దాస్ గుప్తాతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆయా కంపెనీలు సీఎంతో ములాఖ‌త్ అయ్యాయి. విస్తృతంగా చ‌ర్చించారు. కంపెనీల చీఫ్ లు , చైర్మ‌న్లు సీఎంను ప్ర‌త్యేకంగా అభినందించారు. రాష్ట్రం ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు, సింగ‌పూర్ మ‌ధ్య దీర్ఘ‌కాల సంబంధాల‌ను క‌లిగి ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా మారే త‌మ ప్ర‌యాణంలో భాగ‌స్వాములు చేసినందుకు ప్ర‌తి ఒక్క‌రినీ అభినందించారు సీఎం. పున‌రుత్పాద‌క ఇంధ‌నం, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ లో ఇప్ప‌టికే ఉన్న పెట్టుబ‌డుల‌ను ఫుడ్ ప్రాసెసింగ్ , ఫిషింగ్ వంటి కొత్త రంగాల‌కు విస్త‌రించే అవ‌కాశాల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు ఎంకే స్టాలిన్. త‌మిళ‌నాడు, సింగ‌పూర్ మ‌ధ్య చారిత్ర‌క , ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన భాగ‌స్వామ్యాన్ని క‌లిగి ఉండాల‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : Priyanka Chopra

Leave A Reply

Your Email Id will not be published!