CM KCR : తెలంగాణ కీర్తిని చాటేలా సంబురాలు అంబరాన్ని తాకాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్(CM KCR). 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆయా రోజుల్లో ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి గురించి సీఎం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేపట్టాలని ఆదేశించారు. త్వరలో ఎన్నికలు రానుండడంతో ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ కు దిగారు కేసీఆర్.
జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను సీఎం ప్రారంభిస్తారు. గన్ పార్క్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పిస్తారు. 3న రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతారు. 4న సురక్షా దినోత్సవాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడతారు.
5న విద్యుత్ విజయోత్సవం నిర్వహిస్తారు. 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఐటీ కారిడార్లలో సభలు చేపడతారు. 7న సాగునీటి దినోత్సవాన్ని చేపడతారు. సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి గురించి వివరిస్తారు. 8న ఊరూరా చెరువుల పండుగ జరుపుతారు. 9న సంక్షేమ సంబురాలు చేపడతారు. ఇందులో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియ చేస్తారు.
10న సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 11న సాహిత్య దినోత్సవాన్ని చేపడతారు. కవి సమ్మేళనాలు ఉంటాయి. 12న తెలంగాణ రన్ చేపడతారు. 13న మహిళా సంక్షేమ దినోత్సవం జరుపుతారు. 14న వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతారు. 15న పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 16న పట్టణ ప్రగతి దినోత్సవాన్ని చేపడతారు. 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న మంచి నీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20న విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 22న అమరుల సంస్మరణ కార్యక్రమం ఉంటుంది.
Also Read : MK Stalin
