పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కమాల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢమాల్
కేఎల్ రాహుల్ సెంచరీ వృధా చెలరేగిన కెప్టెన్ అయ్యర్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ వరుస విజయాలతో దూసుకు పోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ముందు ఉంచిన భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. తమకు ఎదురే లేదని చాటింది. ఏకంగా నిర్దేశించిన 265 పరుగులను ఊదేసింది. ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు నమోదు చేసింది పంజాబ్ . ఇరు జట్ల మధ్య పరుగుల వరద పారింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 264 రన్స్ చేసింది. మరో వైపు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.
ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికీ ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు పంజాబ్ ప్లేయర్లు. యంగ్ ఓపెనర్స్ ప్రభ్ సిమ్రన్ సింగ్ కేవలం 26 బంతులు ఎదుర్కొని 76 రన్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ తర్వాత కెప్టెన్ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తను తగ్గరుండి గెలిపించాడు. కేవలం 36 బతులు ఎదుర్కొని 71 రన్స్ చేశాడు అజేయంగా నిలిచాడు. ఇందులో 3 పోర్లు 7 సిక్సులు ఉన్నాయి. తర్వాత ప్రియాంశ్ ఆర్య 17 బంతులలో 2 ఫోర్లు 5 సిక్సులతో 43 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశారు. అద్బుత విజయాన్ని నమోదు చేశారు.
