హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. శనివారం అధికారికంగా పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. పేరు కూడా ఖరారు చేశారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తన తండ్రి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టారు. అది మొదట్లో ఉద్యమంగా మొదలైంది. ఆ తర్వాత పార్టీగా మార్చేశారు. మరో వైపు దానిని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చేశారు. దానిని దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఢిల్లీ వేదికగా ప్రకటించారు. కానీ తాను అనుకున్నట్లు తెలంగాణలో పవర్ లోకి రాలేదు. తనను కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దొరతనం చెల్లదని తేల్చి చెప్పారు.
ఈ తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలుపాలైన తన కూతురు కల్వకుంట్ల కవిత ఉన్నట్టుండి తన కుటుంబంతో బంధం తెంచుకుంది. ఆ తర్వాత జనంలోకి వెళ్లింది. ఉన్నట్టుండి ఇవాళ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. అన్నట్టుగానే తానేమిటో నిరూపించింది. పార్టీ పేరు ప్రకటించిన అనంతరం ప్రసంగించారు. తాను 3 కోట్ల మందికి ‘అమ్మ’ను అవుతానని చెప్పారు కవిత. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. ఆనాడు పాలించిన కుటుంబంలో నేనూ భాగంగా ఉన్నానని, అందుకు సిగ్గు పడుతున్నా. దీనికి క్షమాపణ చెబుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధించినందుకు తన జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆత్మ కోల్పోయిందని అందుకే ఇవాళ టీఆర్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు.
