క‌లెక్ట‌ర్ వేధింపుల కేసులో టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్

త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ కు వ‌రుస షాక్ లు

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర స‌ర్కార్ కు , ప్ర‌త్యేకించి సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కు వ‌రుస షాక్ లు త‌గులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ కు బిగ్ షాక్ త‌గిలింది. జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌డం, అస‌భ్య‌ర‌క‌ర ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించి క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే త‌మ‌ను బ‌ద్నాం చేసేందుకే డీఎంకే ఎంపీ ఫిర్యాదు చేశారంటూ టీవీకే మంత్రి ఆరోపించారు. దీంతో ఐఏఎస్ అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై కల్లకురిచి టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్టు అయ్యారు. ఎఫ్ఐఆర్ నమోదైన మూడు రోజుల తర్వాత త‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

నాలుగు రోజుల పాటు ప్రజాగ్రహం, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిన నేపథ్యంలో అరుల్ విఘ్నేష్‌ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారిణి సృష్టి సింగ్ నేతృత్వంలోని పోలీసు బృందం ఎమ్మెల్యేను ఆయన నివాసం నుంచి అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు ఎమ్మెల్యే నివాసాన్ని దిగ్బంధించి, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. 24న కల్లకురిచిలోని ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఒక ప్రథమ సమాచార నివేదిక నమోదైంది.

భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 75 (లైంగిక వేధింపులు), 78(2) (వెంటపడటం), 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధి నిర్వహణ నుండి నిరోధించడానికి దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగం చేయడం)తో పాటు, లైంగిక వేధింపుల నివారణ చట్టంలోని సెక్షన్ 4 కింద ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. 23న ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి పోష్ చట్టం కింద తమిళనాడు ముఖ్య కార్యదర్శి ఎం. సాయి కుమార్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించిన తర్వాత ఈ కేసు నమోదైంది.

Leave A Reply

Your Email Id will not be published!