జపాన్ : తెలంగాణ ప్రాంతానికి చెందిన విలక్షణ నటుడు విజయ్ దేవరకొండ సంచలనంగా మారాడు. తన భార్య, పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్నాతో పాటు కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రముఖ పండుగ అయిన దీపావళిని అక్కడే జరుపుకున్నారు. జపాన్‌లో ఉన్నప్పటికీ అక్కడే గోమం (హోమం) నిర్వహించి దీపావళిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి దిగిన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “దీపావళి శుభాకాంక్షలు.. మా దేవరకొండ కుటుంబం తరఫున మీ అందరికీ ప్రేమాభిమానాలు, ఆప్యాయ ఆలింగనాలు” అంటూ అభిమానులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం విజయ్ షేర్ చేసిన ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హల్ చల్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు కలిసి చాలా కాలం తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి మూవీలో నటించారు. ఇది ఆనాటి బ్రిటీష్ కాలం లో రాయలసీమ ప్రాంతంలో చోటు చేసుకున్న వాస్తవ ఘటనను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు . ఈ సినిమా గత నెల అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మిశ్రమ స్పందన వచ్చింది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో భార్య భర్తలు ఇద్దరూ పోటీపడి నటించారు. తెరపై వీరి ప్రేమ కూడా పండింది. కానీ ఆశించిన మేర స్పందన రాక పోవడం కూడా ఒకింత బాధ పెట్టింది.