భార‌త‌దేశానికి మ‌హిళలే అతి పెద్ద బ‌లం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ లోక్ స‌భ ప్ర‌తిపక్ష నేత‌, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మ‌హిళ‌ల గురించి. దేశానికి అతి పెద్ద బ‌లం, విలువైన సంప‌ద అని పేర్కొన్నారు. త‌న‌ను చాలాసార్లు ప్రజలు నన్ను అడుగుతుంటారని .భారతదేశం అతిపెద్ద బలం ఏమిటి అని. మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. కొందరు మన ఆర్థిక వ్యవస్థ అంటారు, కొందరు మన సైన్యం అంటారు, కొందరు మన వైద్య వ్యవస్థ అంటారు, మరికొందరు మన ప్రజలు అని కూడా అంటారు.

కానీ భారతదేశం అసలైన అతిపెద్ద బలం ఏమిటి..? మన దేశపు అత్యంత విలువైన ఆస్తి ఏమిటి..? అనే విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉందని చెప్పారు రాహుల్ గాంధీ. ఆ బలం మరేదో కాదని , భారతదేశ మహిళలు జీవిస్తున్న 70 కోట్ల విశిష్టమైన ప్రయాణాలు, సరికొత్త ఆలోచనలు, విలక్షణమైన కలలు త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు ఎంపీ. ఎవరైనా నన్ను అడగవచ్చు దేశంలో 70 కోట్ల మంది పురుషులు కూడా ఉన్నారు కదా, మరి 70 కోట్ల మంది మహిళలే ఎక్కువ ముఖ్యమని మీరు ఎలా చెబుతారు అని. దానికి నా సమాధానం, లాజిక్ ఇదేన‌ని పేర్కొన్నారు.

మహిళలు సహజ సిద్ధంగానే పురుషుల కంటే ఎక్కువ సున్నితత్వం , ఎక్కువ దయ-సహృదయత , అమితమైన కరుణ, భవిష్యత్తును ముందుగానే ఆలోచించే దార్శనికత ఉంటారన్నారు. అందుకే నేను మనస్ఫూర్తిగా గట్టిగా నమ్ముతున్నాను. భారతదేశ మహిళలు, యువతులైనా లేదా వృద్ధులైనా, వారే మన దేశానికి అత్యంత బలమైన సంపద, నిజమైన ఆస్తి అని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!