Haryana Panel Chief : హర్యానా ప్యానల్ చీఫ్ భాటియా ఫైర్
గెట్ అవుట్ అంటూ అధికారిపై ఆగ్రహం
Haryana Panel Chief : హర్యానా మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేణు భాటియా నిప్పులు చెరిగారు. ఓ కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన మహిళా పోలీస్ అధికారిపై నోరు పారేసుకున్నారు.
ఆపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గెటవుట్ అంటూ ఊగి పోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చర్చనీయాంశంగా మారింది నెట్టింట్లో.
ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హర్యానా లోని కైతాల్ వివాహ వివాదానికి సంబంధించిన కేసుపై చర్చతో కూడిన సమావేశం నిర్వహించారు.
మహిళా ప్యానెల్ చీఫ్ రేణు భాటియా(Haryana Panel Chief) ఆగ్రహంతో ఊగి పోవడంతో అక్కడ హాజరైన అధికారులంతా అవాక్కయ్యారు. సదరు పోలీస్ అధికారిణిని సహ ఉద్యోగి గది నుండి బయటకు తీసుకు వెళ్లేంత వరకు ఈ గొడవ కొనసాగడం విస్తు పోయేలా చేసింది.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వ్యవహరించిన తీరుపై పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైర్ పర్సన్ స్థానంలో ఉన్న ఆమె ఓ అధికారి పట్ల ఇలాగేనా వ్యవహరించేదంటూ మండి పడుతున్నారు.
పదవికి తగినట్లుగా ఆమె వ్యవహరించ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెమెరాల ముందు ఆమె వాడిన పరుష పదజాలం కెమెరాలలో చిక్కింది. స్థానిక జర్నలిస్ట్ రికార్డు చేసిన ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
రేఖా భాటియా మాట్లాడుతూ నువ్వు అతడిని చెంప ఛెళ్లుమనిపించే దానివి. బయటకు వెళ్లు. నేను నీ గురించి ఏమీ వినదల్చు కోలేదంటూ ఆగ్రహంతో ఊగి పోయారు చైర్ పర్సన్.
దీంతో పోలీసు అధికారి నుండి నిరసన వ్యక్తమైంది. భార్య భర్తల మధ్య వివాదం తలెత్తినప్పుడు పోలీస్ అధికారి వ్యవహరించిన తీరుపై వాగ్వావాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
Also Read : త్వరలోనే జపాన్..భారత్ విజన్ విడుదల
Video | "Get Out" – Haryana Women's Panel Chief vs Woman Cop https://t.co/8gu2HmiZAl pic.twitter.com/oCPwICVtMh
— NDTV (@ndtv) September 9, 2022