John Cusack : రాహుల్ యాత్రకు జాన్ కుసాక్ సంఘీభావం

నెట్టింట్లో హాలీవుడ్ న‌టుడి ప్ర‌స్తావ‌న హ‌ల్ చ‌ల్

John Cusack : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. ఈ యాత్ర త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు కొన‌సాగుతుంది. మొత్తం 3,570 కిలోమీట‌ర్లు 150 రోజుల పాటు జ‌రుగుతుంది. ఇప్ప‌టికే రాహుల్ త‌న యాత్ర‌ను త‌మిళ‌నాడులో పూర్తి చేసి కేర‌ళ‌లో కొన‌సాగుతోంది.

అనంత‌రం క‌ర్ణాట‌క‌కు చేరుకుంటుంది. ప్ర‌తిరోజూ ఉద‌యం 6.30 గంట‌ల నుండి సాయంత్రం 6.30 గంట‌ల దాకా కొన‌సాగుతుంది. రాహుల్ గాంధీ యాత్రకు భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. పార్టీల‌కు అతీతంగా అభినందిస్తున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో ప్రాంతాలు, కులాలు, మ‌తాల పేరుతో రాజ‌కీయాలు చేస్తూ ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారంటూ ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ త‌రుణంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్ సైతం రాహుల్ గాంధీ(Rahul Gandhi) యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని కోర‌డం విశేషం.

బీజేపీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇదే క్ర‌మంలో ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు జాన్ కుసాక్(John Cusack)  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌త్యేకంగా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం జాన్ కుసాక్ చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

ఎంపీ చేప‌ట్టిన పాద‌యాత్ర బాగుంద‌ని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం దేశంలోని 12 రాష్ట్రాల‌ను క‌వ‌ర్ చేస్తుంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా హాలీవుడ్ న‌టుడు జాన్ కుసాక్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

Also Read : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!