Pakistan Fan Girl Natasha : పాకిస్తాన్ ముద్దుగుమ్మ‌ న‌టాషా వైర‌ల్

పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ లో క్లిక్

Pakistan Fan Girl Natasha : సోష‌ల్ మీడియాలో ఎవ‌రు ఎప్పుడు వైర‌ల్ గా మారుతారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా వేదిక‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వ‌ర్యంలో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కొన‌సాగుతోంది. అనుకోకుండా అదృష్టం క‌లిసొచ్చి ఏకంగా సెమీస్ కు చేరుకున్న పాకిస్తాన్ ఊహించ‌ని రీతిలో కేన్ మామ సార‌థ్యంలోని న్యూజిలాండ్ కు షాక్ ఇచ్చింది.

బాబ‌ర్ ఆజ‌మ్ సార‌థ్యంలోని దాయాది పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఓడించి ఏకంగా ఫైన‌ల్ కు చేరింది. ఒకానొక ద‌శ‌లో పెట్టే బేడా స‌ర్దుకున్న ఆ జ‌ట్టుకు నెద‌ర్లాండ్స్ రూపంలో అదృష్టం క‌లిసి వ‌చ్చింది. ఈ త‌రుణంలో నెద‌ర్లాండ్స్ చేతిలో బ‌ల‌మైన సౌతాఫ్రికా త‌ల‌వంచింది.

దీంతో మెరుగైన ర‌న్ రేట్ కార‌ణంగా పాకిస్తాన్ సెమీస్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా మొద‌టి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో పాకిస్తాన్ కు చెందిన ఫ్యాన్ (అభిమాని) న‌టాషా ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చింది. ఆమె పాకిస్తాన్ దేశానికి చెందిన జాతీయ జెండా గుర్తును ధ‌రించి హ‌ల్ చ‌ల్ చేసింది.

స్టేడియంలో వేలాది మంది ఉన్నా కెమెరాలు, ఫోన్ల‌న్నీ సెల్ఫీల‌తో క్లిక్ మ‌ని అనిపించాయి.ఎక్క‌డ చూసినా ప్ర‌స్తుతం న‌టాషా(Pakistan Fan Girl Natasha) గురించి వాక‌బు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ ల‌వ‌ర్స్. ట్విట్ట‌ర్, ఇన్ స్టా గ్రామ్, త‌దిత‌ర సోష‌ల్ మీడియా ప్లాట్ ఫార‌మ్ ల‌లో ఎవ‌రీ ముద్దుగుమ్మ అంటూ వెతుకుతున్నారు.

అందంతో పాటు వివిధ అంశాల‌కు సంబంధించి మంచి ప‌ట్టు ఉండ‌డంతో ప్ర‌స్తుతం న‌టాషా టాప్ లెవ‌ల్లోకి వ‌చ్చేసింది. తాజాగా కామెంట్స్ తో హోరెత్తుతోంది ఈ ముద్దుగుమ్మ మాట‌ల‌తో. సో వీలైతే మీరూ లుక్ వేయండి న‌టాషా అంటే ఏమిటో తెలుస్తుంది.

Also Read : సీనియ‌ర్ల‌కు షాక్ ఇవ్వ‌నున్న బీసీసీఐ..?

Leave A Reply

Your Email Id will not be published!