Saudi Arabia Shock : అబ్బా సౌదీ అరేబియా దెబ్బ

అర్జెంటీనాకు కోలుకోలేని షాక్

Saudi Arabia Shock : మోస్ట్ పాపుల‌ర్ ఫుట్ బాల‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే ప్ర‌స్తుతం మెస్సీ ఒక్క‌డే. ప్ర‌స్తుతం ఖ‌తార్ వేదిక‌గా ఫిఫా పుట్ బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ కొన‌సాగుతోంది. ఇక మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనాకు కోలుకోలేని షాక్ (Saudi Arabia Shock) త‌గిలింది. ఊహించ‌ని రీతిలో 2-1 తేడాతో చుక్క‌లు చూపించింది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ ఫేవ‌రేట్ గా అర్జెంటీనా ఉంది. ఈ జ‌ట్టులో క‌ళ్లు చెదిరే గోల్స్ చేసే స‌మ‌ర్థ‌వంత‌మైన ఆట‌గాళ్లు ఉన్నారు. ఇప్ప‌టికే ఈ టీమ్ రెండు సార్లు క‌ప్ కైవ‌సం చేసుకుంది. మూడు సార్లు ర‌న్న‌ర‌ప్ గా నిలిచి చ‌రిత్ర సృష్టించింది. కానీ అనామ‌క జ‌ట్టుగా భావించిన సౌదీ అరేబియా చేతిలో ఓట‌మి పాల‌డం విస్తు పోయేలా చేసింది.

అర్జెంటీనా అభిమానులు ఈ ప‌రాజ‌యాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు. టోర్నీలో మొద‌టి మ్యాచ్ లోనే ఓట‌మి పాలు కావ‌డం ఒక్క‌సారిగా బిగ్ షాక్ కు గురి చేసింది. ఖ‌తార్ లోని లుసైల్ లో ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ ఆద్యంత‌మూ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉండ‌గా త‌న కెరీర్ లో ఇదే ఆఖ‌రి వ‌ర‌ల్డ్ క‌ప్ అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు మెస్సీ.

ఇప్ప‌టి వ‌ర‌కు ఫుట్ బాల్ చ‌రిత్ర‌లో కేవ‌లం మూడంటే మూడు మ్యాచ్ లు మాత్ర‌మే గెలుపొందింది సౌదీ అరేబియా. కానీ అనూహ్యంగా అర్జెంటీనాకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. మ‌రో వైపు ఆట ప్రారంభ‌మైన ప‌దో నిమిషంలోనే మెస్సీ అద్భుత‌మైన గోల్ సాధించాడు.

సౌదీకి చెందిన స‌లెహ్ అల్ షెహ్రీ ఆట 48వ నిమిషంలో గోల్ కొట్టాడు. అనంత‌రం 58వ నిమిషంలో సాలెమ్ అల్ ద‌వ్ స‌రి క‌ళ్లు చెదిరే బంతిని గోల్ గా మార్చాడు.

Also Read : టీమిండియాదే టి20 సీరీస్

Leave A Reply

Your Email Id will not be published!