IND vs BAN 1st ODI 2022 : బంగ్లాదేశ్ భార‌త్ బిగ్ ఫైట్

తొలి వ‌న్డే మ్యాచ్ కు సిద్దం

IND vs BAN 1st ODI 2022 : బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా ఆదివారం తొలి వ‌న్డే మ్యాచ్ కోసం భార‌త్(IND vs BAN 1st ODI 2022)  సిద్ద‌మైంది. ఇరు జ‌ట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డే అవ‌కాశం ఉంది. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఘోరంగా ఓట‌మి పాలైంది ఇంగ్లండ్ చేతిలో.

సెమీ ఫైన‌ల్ లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. దీంతో సెలెక్ష‌న్ క‌మిటీ ఎంపిక తీరుతో పాటు బీసీసీఐలో చోటు చేసుకున్న రాజ‌కీయాల‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో సెలెక్ష‌న్ క‌మిటీని ర‌ద్దు చేసింది. గంగూలీ త‌ర్వాత బాధ్య‌త‌లు చేప‌ట్టిన బిన్నీ ఉన్నా ఒక‌టే లేకున్నా ఒక‌టే అన్న రీతిలో న‌డుస్తోంది బీసీసీఐ.

మొత్తం అంతా జే షా క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తోంది. అన్నీ ఆయ‌నే ప్ర‌క‌టిస్తున్నాడు. బిన్నీ చోద్యం చూస్తున్నాడు. ఈ త‌రుణంలో కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ సూప‌ర్ ఫామ్ లో ఉన్నా కావాల‌ని ప‌క్క‌న పెట్టేశారు. వ‌రుస‌గా 11 సార్లు వైఫ‌ల్యం చెందినా రిష‌బ్ పంత్ ను బంగ్లా టూర్ కు ఎంపిక చేశారు.

బాగా ఆడ‌క పోయినా ఇషాన్ కిష‌న్ కు చాన్స్ ఇచ్చింది బీసీసీఐ. ష‌మీకి గాయం కావ‌డంతో ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేశారు.

ఇక జ‌ట్టు విష‌యానికి వ‌స్తే రోహిత్ శ‌ర్మ కెప్టెన్ , కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ కాగా శిఖ‌ర్ ధావ‌న్ , కోహ్లీ, అయ్య‌ర్, పంత్ , ఇషాన్ కిష‌న్ , ర‌జిత్ పాటిదార్ , రాహుల్ త్రిపాఠి, అక్ష‌ర్ ప‌టేల్ , సుంద‌ర్ , కుల్దీప్ సేన్ , ఉమ్రాన్ మాలిక్ , దీప‌క్ చాహ‌ర్ , ఠాకూర్ , షాబాజ్ అహ్మ‌ద్, సిరాజ్ ఉన్నారు.

Also Read : పంత్ కే ఓటు శాంస‌న్ పై వేటు

Leave A Reply

Your Email Id will not be published!