Kavya Maran Comment : కావ్య మారన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్
అందమే ఆనందం ఆటకు అందం
Kavya Maran Comment : ఆటకు అందానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే క్రీడా, సినీ రంగాలకు చెందిన వారు చెట్దా పట్టాలు వేసుకోవడం, పెళ్లి దాకా వెళ్లడం సర్వ సాధారణంగా మారింది. ప్రపంచంలో క్రీడాకారులకు అది ఏ రంగానికి చెందిన వారైనా సరే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
అందుకే దిగ్గజ కంపెనీలన్నీ వాళ్లపై ఫోకస్ పెడతాయి. అడిగినంత మేర ఖర్చు చేసేందుకు వెనుకాడవు. ఇక క్రికెట్ పరంగా చూస్తే ఏ ముహూర్తాన లలిత్ మోదీ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ )ను స్టార్ట్ చేశాడో కానీ ఈ ఫార్మాట్ తో నిర్వహించే టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని ఆదరణ నెలకొంది.
ఈ రిచ్ మెగా లీగ్ పై ఎన్నో కంపెనీలు కన్నేశాయి. ఇక ఇందులో ఆడే ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి సినీ నటులు ఉన్నారు. కానీ ఏ రంగానికి చెందని కేవలం వ్యాపార రంగం నుంచి మాత్రమే వచ్చిన కళానిధి మారన్ కూతురు(Kavya Maran) కావ్య మారన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఆమె ఏది చేసినా లేక ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. ఆమె అందంతో పాటు శబ్దం లేకుండా చేసే చిరునవ్వు కూడా కుర్ర కారును గిలిగింతలు పెట్టేలా చేస్తోంది. గతంలో జరిగిన ఐపీఎల్ వేలం పాటల్లో కావ్య మారన్ అందరి దృష్టిని ఆకర్షించారు.
తాజాగా జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో కెమెరా కళ్లన్నీ ఆమె వైపు చూసేలా చేశాయి. కోట్లాది సంపదకు ఆమె వారసురాలు. అంతే కాదు ఆసియా ఖండంలో అత్యంత ప్రసిద్ది చెందిన మీడియా కంపెనీలలో ఒకటిగా పేరున్న సన్ నెట్ వర్క్ యజమాని అయిన కళానిధి మారన్ ముద్దుల కూతురే ఈ కావ్య మారన్. తల్లి కావేరీ మారన్. ప్రస్తుతం ఈ కంపెనీ సన్ రైజర్స్ హైదరాబాద్ ను టేకోవర్ చేసుకుంది.
కావ్య దీనికి చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా ఉన్నారు. ప్రస్తుతం కళానిధి వ్యాపారా సామ్రాజ్యాన్ని ఒంటిచేత్తో నడిపిస్తోంది కావ్య మారన్(Kavya Maran). ఆగస్టు 6, 1992లో తమిళనాడులోని చెన్నైలో పుట్టారు ఆమె. కావ్య మారన్ కుటుంబానికి రాజకీయ చరిత్ర కూడా ఉంది. ఆమె తాతయ్య మురసోలి మారన్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు.
తండ్రి కళానిధి మారన్ దివంగత సీఎం కరుణానిధికి మేనల్లుడు. ఎంబిఏ చదువుకున్నారు. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా రాణించారు. కానీ తాను టేకోవర్ చేసుకున్న జట్టు మాత్రం ఆశించిన మేర రాణించలేక పోవడాన్ని తట్టుకోలేక పోతున్నారు. ఏది ఏమైనా కావ్య మారన్ ఓ సెన్సేషన్ . యూత్ కు..ప్రధానంగా కుర్ర కారుకు ఓ ఐకాన్.
Also Read : మళ్లీ మెరిసిన కావ్య మారన్