Tunisha Sharma Suicide : నటి తునీషా శర్మ ఆత్మహత్య
సహ నటుడిపై తల్లి ఫిర్యాదు
Tunisha Sharma Suicide : ప్రముఖ నటి తునీషా శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమెకు 20 ఏళ్లు. సినిమా సెట్ లో చని పోయినట్లు కనుగొన్నారు పోలీసులు. ఇదిలా ఉండగా తన కూతురు సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని తల్లి ఆరోపించింది. తన కూతురును సహ నటుడు షీజాన్ మహమ్మద్ ఖాన్ ప్రమేయం ఉందంటూ ఆరోపించింది.
ఈ మేరకు తునీషా శర్మ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలీవుడ్ లో కలకలం రేగింది. ఆమె ఉరి వేసుకుని కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా తునీషా శర్మ అలీ బాబా దస్తాన్ ఇ కాబూల్ షోలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ పాత్ర ద్వారా ఆమెకు ఎంతగానో పేరొచ్చింది.
అత్యంత చిన్న వయస్సులోనే ఇలాంటి ఘటనకు పాల్పడడంతో బాలీవుడ్ లో విషాదం అలుముకుంది. మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లా లోని వసాయి లో సీరియస్ సెట్ లో శనివారం టెలివిజన్ నటి తునీషా శర్మ ఆత్మహత్యకు(Tunisha Sharma Suicide) పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన సహ నటుడు షీజాన్ మహమ్మద్ ఖాన్ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా 20 ఏళ్ల నటి తునీషా శర్మ సెట్ లోని వాష్ రూమ్ కు వెళ్లి చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. తలుపులు పగుల గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకున్నట్లు కనిపించింది. సెట్ లో ఉన్న వారు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే తునీషా శర్మ చని పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read : నటుడు చలపతిరావు కన్నుమూత