Sheezan Khan Arrest : న‌టుడు షీజాన్ ఖాన్ అరెస్ట్

తునీషా కేసులో నిందితుడు

Sheezan Khan Arrest : సీరియ‌ల్ షూటింగ్ లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన యువ న‌టి తునీషా శ‌ర్మ సూసైడ్ కేసులో కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌హ న‌టుడు షీజాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్(Sheezan Khan Arrest) చేశారు. కోర్టులో ఇవాళ హాజ‌రుప‌ర్చారు. ముంబై లోని వాసాయి కోర్టు నాలుగు రోజుల క‌స్ట‌డీ విధించింది. నిన్న షూటింగ్ లో ఉండ‌గా తునీషా శ‌ర్మ బాత్రూంకు వెళ్లింది.

ఎంత‌కూ రాక పోవ‌డంతో షూటింగ్ లో ఉన్న సిబ్బంది త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి చూశారు. ఆమె ఉరి వేసుకుని ఉండ‌డం క‌నిపించింది. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు తునీషా శ‌ర్మ చ‌ని పోయింద‌ని వెల్ల‌డించారు. దీంతో మృతురాలి త‌ల్లి త‌న కూతురు సూసైడ్ చేసుకోవ‌డం వెనుక స‌హ న‌టుడు షీజాన్ ఖాన్ పాత్ర ఉంద‌ని , గ‌త కొంత కాలంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

దీంతో షీజాన్ ఖాన్ ను తెల్ల‌వారుజామున అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తునీషా శ‌ర్మ కేసును సూసైడ్ కేసుగా న‌మోదు చేశారు. విచార‌ణ‌లో షీజాన్ ఖాన్ , తునీషా శ‌ర్మ గ‌త కొంత కాలం నుంచి ప్రేమ‌లో ఉన్న‌ట్లు తేలింది. 15 రోజుల కింద‌ట ఆమె ప్రేమ‌కు ఖాన్ బ్రేక‌ప్ చెప్పడంతో త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు పోలీసులు.

త‌ట్టుకోలేక ఇలాంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డింద‌ని తేల్చారు. ఆమె సూసైడ్ చేసుకునేలా షీజాన్ ఖాన్ ప్రేరేపించిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం కావ‌డంతో అత‌డిని అరెస్ట్ చేశారు. క‌స్ట‌డీ కోర‌డంతో కోర్టు వెంట‌నే అనుమ‌తి ఇచ్చింది. నాలుగు రోజుల పాటు విచార‌ణ చేసేందుకు.

Also Read : న‌టి తునీషా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య‌\

Tunisha Sharma Suicide : న‌టి తునీషా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య‌

Leave A Reply

Your Email Id will not be published!