KTR Slams : కిష‌న్ రెడ్డిపై కేటీఆర్ క‌న్నెర్ర‌

ఆయ‌న మాట‌ల‌న్నీ అన్నీ అబ‌ద్దాలే

KTR Slams : తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. మ‌రో వైపు బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే సవాళ్ల ప‌ర్వం మొద‌లు కాగా తాజాగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై నిప్పులు(KTR Slams) చెరిగారు.

తెలంగాణ‌కు ఏం ఇచ్చార‌నే దానిపై చెప్ప‌కుండా అన్నీ సొల్లు క‌బుర్ల‌తో ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం క‌ట్టిన డ‌బ్బుల‌ను తీసుకు వెళ్లి ఇత‌ర బీజేపీ ఆధీనంలో ఉన్న రాష్ట్రాల‌లో ఖర్చు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్.

తాను చేసిన ఈ ఆరోప‌ణ త‌ప్ప‌ని రుజువు చేస్తే త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ విసిరారు. కేంద్ర కేబినెట్ లో ఉన్న మంత్రికి క‌నీసం సోయి కూడా లేనట్లుగా మాట్లాడుతున్నారంటూ మండిప‌డ్డారు కేటీఆర్. కావాల‌ని తెలంగాణ‌పై వివ‌క్ష చూపుతున్నారంటూ వాపోయారు.

ఒక‌వేళ తాను చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని రుజువు చేస్తే తాను ప‌దవి నుంచి త‌ప్పుకుంటాన‌ని ఒక వేళ అవి నిజ‌మైతే త‌ను కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని పిలుపునిచ్చారు. బీజేపీ నాయ‌కుల‌కు అవ‌గాహ‌న ఉండ‌ద‌ని, స‌మాచారం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌ర‌ని మండిప‌డ్డారు. పొద్ద‌స్త‌మానం కులం, మ‌తం త‌ప్ప ఇంకేమీ ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారు కేటీఆర్(KTR Slams).

ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామ‌న్న కేంద్ర స‌ర్కార్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

Also Read : స‌త్య నాదెళ్ల‌తో కేటీఆర్ ములాఖ‌త్

Leave A Reply

Your Email Id will not be published!