Pathan Movie Record : రూ. 400 కోట్ల క్ల‌బ్ లో ప‌ఠాన్

మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ గా రికార్డ్

Pathan Movie Record : షారుఖ్ ఖాన్ , దీపికా ప‌దుకొనే , జాన్ అబ్ర‌హం క‌లిసి న‌టించిన ప‌ఠాన్ మూవీ విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా కోట్లు కొల్లగొడుతోంది. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 25న విడుద‌లైంది ప‌ఠాన్ మూవీ. రిలీజ్ అయిన సినిమాను పెద్ద ఎత్తున జ‌నం ఆద‌రిస్తున్నారు.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 400 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇది ఓ ర‌కంగా బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మంచి బూస్ట్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నాలుగు సంవ‌త్స‌రాల విరామం (గ్యాప్ ) త‌ర్వాత ప‌ఠాన్ మూవీతో ప్రేక్ష‌కుల‌కు ముందు వ‌చ్చాడు.

ప‌ఠాన్(Pathan Movie Record) థియేట‌ర్ల‌లో మొద‌టి శ‌నివారం బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రో బ‌ల‌మైన రోజును న‌మోదు చేసింది. భారీ ఎత్తున కోట్ల‌ను దాట‌డం చిత్ర యూనిట్ తో పాటు మిగ‌తా వారిని కూడా విస్తు పోయేలా చేసింది. భార‌త దేశంలో రూ. 200 కోట్ల రూపాయ‌ల మార్క్ లోకి ప్ర‌వేశించింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్ల‌ను కొల్ల‌గొడుతుంద‌నేది చెప్ప‌లేమంటున్నారు సినీ పండితులు.

కేవ‌లం నాలుగే నాలుగు రోజుల్లో రూ. 400 కోట్ల‌ను దాటడం మామూలు విష‌యం కాదు. జ‌న‌వ‌రి 27 వ‌ర‌కు ఇండియాలో రూ. 166 కోట్లు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 316 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ప‌ఠాన్ ఓవ‌ర్సీస్ లో రూ. 49 కోట్లు సాధించింది. మొత్తంగా చూస్తే రూ. 420 కోట్ల‌కు పైగానే అన్న‌మాట‌. ఇదిలా ఉండ‌గా భారీ ఎత్తున స‌క్సెస్ టాక్ అందుకోవ‌డంతో సినీ యూనిట్ తెగ ముచ్చ‌ట ప‌డుతోంది.

Also Read : గొడ‌వ‌లు నిజం కలవ‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!