Balakrishna Tarakaratna : తారకరత్న ఆరోగ్యంపై బాలయ్య క్లారిటీ
మొదట ఇబ్బందిగా ఉన్నా కోలుకున్నారు
Balakrishna Tarakaratna : నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై స్పందించారు నటుడు నందమూరి బాలకృష్ణ. ఆదివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. మరో వైపు నటులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ పరామర్శించారు. బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర పేరుతో కుప్పంలో పాదయాత్ర చేపట్టారు.
ఈ తరుణంలో పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడి పోయాడు. తీరా చూస్తే ఆయనకు గుండె నొప్పి వచ్చిందని వైద్యులు నిర్దారించారు. తారకరత్నను కుప్పం ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.
అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఐసీయూలో ఉంచారు. పరిస్థితి విషమించిందని సమాచారం రావడంతో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. మొదట గుండె కొట్టుకోవడం ఆగి పోయింనది , ఆ తర్వాత అద్భుతం జరిగిందని చెప్పారు బాలకృష్ణ(Balakrishna Tarakaratna) .
ఇక్కడ మంచి వైద్యం అందజేస్తున్నారని చెప్పారు నటుడు. ప్రస్తుతం అంతా నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని తెలిపారు నందమూరి బాలకృష్ణ. నారాయణ హృదయాలయకు ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
తారకరత్న ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు, కన్నడ ప్రజల ప్రార్థనలు తమ తారక వైపు ఉన్నాయని , త్వరలోనే కోలుకుంటాడన్న నమ్మకం తనకు ఉందన్నారు నటుడు నందమూరి బాలకృష్ణ.
Also Read : రమ్య నుంచి ప్రాణగండం – నరేష్