T20 World Cup New Zealand : న్యూజిలాండ్ సత్తా చాటేనా
కప్పు కొట్టాలని ప్లాన్
T20 World Cup New Zealand : దక్షిణాఫ్రికా వేదికగా మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే 10 జట్లు చేరుకున్నాయి. సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ తరుణంలో న్యూజిలాండ్ మహిళా జట్టు ఫుల్(T20 World Cup New Zealand) నమ్మకంతో ఉంది. ఈసారి తమదే వరల్డ్ కప్ అన్నంత ధీమాతో ఉంది ఆ జట్టు. మరో వైపు తన గ్రూప్ లో ఉన్న జట్లతో సై అంటూ ఢీకొనేందుకు రెడీ అయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెర పడనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 10న ప్రారంభం కానుంది. మొత్తం 10 టీమ్ లు ఆడతాయి. ఈనెల 26న ఫైనల్ జరుగుతుంది. ఫస్ట్ , సెకండ్ సెమీస్ ఉంటాయి. రిజర్వ్ డే లు కూడా ఏర్పాటు చేసింది ఐసీసీ. కేప్ టౌన్ ,పార్ల్ ,గ్కే బెర్హా స్టేడియంలలో మెగా టోర్నీ మ్యాచ్ లు కొనసాగుతాయి.
ఇక వరల్డ్ కప్ లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టు ఇలా ఉంది. అమేలియా కెర్, జెస్ కెర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు, సుజీ బేట్స్, బెర్నాడిన్ బెజుడెన్హౌట్, ఈడెన్ కార్సన్, లారెన్ డౌన్, మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, హేలీ జెన్సన్, ఫ్రాన్ జోనాస్ మరియు సోఫీ డివైన్.
ఈ జట్టులో ఏ సమయంలోనైనా సత్తా చాటే దమ్మున్న ఆటగాళ్లు ఉన్నారు. కానీ కొద్దిగా కుదురుకుంటే చాలు రన్స్ చేయడంలో సిద్దహస్తులన్న పేరుంది. మైదానంలోకి దిగితే కానీ తెలియదు ఏమిటనేది. ఏ జట్టు గెలుస్తుందని.
Also Read : రెఢీ అంటున్న ఐర్లాండ్