Padi Kaushik Reddy : తప్పైంది మేడం మన్నించండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy : మహిళా కమిషన్ దెబ్బకు దిగి వచ్చారు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను అనరాని మాటలు అన్నారు. సీఎం కేసీఆర్ అండ చూసుకుని ఒక ప్రజా ప్రతినిధి అని సోయి తప్పి నోరు జారారు. చివరకు ప్రభుత్వం సైతం బడ్జెట్ సెషన్ లో గవర్నర్ లేకుండా చేయాలని చివరి వరకు ప్రయత్నించింది. కానీ కోర్టు దెబ్బకు దొర దిగి వచ్చిండు. ఏకంగా ఆయననే తమిళి సైకి అసెంబ్లీలో స్వాగతం పలికిండు.
భారత రాజ్యాంగంలో గవర్నర్ కు పవర్ ఎక్కువ. నిన్నటి దాకా కారాలు మిరియాలు నూరారు. ఆమెకు సెక్యూరిటీ లేకుండా చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఒక మహిళ అని చూడకుండా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) గవర్నర్ పట్ల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్షాలు సైతం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. మహిళా సంఘాలు మండిపడ్డాయి.
ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ బద్దంగా నియమితురాలైన గవర్నర్ పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది జాతీయ మహిళా కమిషన్. కౌశిక్ రెడ్డి కామెంట్స్ ను సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. దెబ్బకు దిగొచ్చిండు.
లాయర్ ను వెంట బెట్టుకుని ఢిల్లీకి పోయిండు. ఆడ సారీ చెప్పిండు. బేషరతుగా గవర్నర్ కు క్షమాపణలు చెబుతానని ఇక నుంచి అలా మాట్లాడనంటూ స్పష్టం చేశాడు. దీంతో మొదటిసారి క్షమించి వదిలి వేస్తున్నట్లు మహిళా కమిషన్ పేర్కొంది.
Also Read : గన్నవరంలో గరం గరం
