Rajiv Jain GQG : పెట్టుబడి సామ్రాజ్య సృష్టకర్త రాజీవ్ జైన్
జీక్యూజీ కో ఫౌండర్ ఫ్లోరిడాలో సెన్సేషన్
Rajiv Jain GQG : ఎవరీ రాజీవ్ జైన్ అనుకుంటున్నారా. ఇప్పుడు ఫ్లోరిడాలో మోస్ట్ పాపులర్ వ్యాపారవేత్త. ఏకంగా పెట్టుబడి సామ్రాజ్యాన్నే సృష్టిస్తున్నాడు. అందరినీ విస్తు పోయేలా చేస్తున్నాడు. ఇతడు మరెవరో కాదు ప్రవాస భారతీయుడు. జీక్యూజి సహ వ్యవస్థాపకుడు. మెజారిటీ వాటాను ఫండ్స్ లలో ఇన్వెస్ట్ చేస్తాడు. రోజు రోజుకు సంపదను ఎలా పెంపొందించు కోవాలో రాజీవ్ జైన్ ను(Rajiv Jain GQG )చూసి మిగతా వారు నేర్చుకుంటున్నారు. స్పూర్తి పొందుతున్నారు.
20వ శతాబ్దపు నిర్ణయాత్మక వ్యక్తులలో ఒకడిగా ఉన్నాడు. అనేక పరిశ్రమలో వాటాదారుడిగా ఉండడం ఆయన ప్రత్యేకత. ఇందులో చమురు, పొగాకు, బ్యాంకింగ్, తదితర రంగాలు ఉన్నాయి. కేవలం ఏడేళ్ల లోపు వోంటోబెల్ అసెట్ మేనేజ్ మెంట్ లో మాజీ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ జైన్ జీక్యూజీని $92 బిలియన్ల పవర్ హౌస్ గా నిర్మించారు. కొన్ని స్టార్టప్ ఫండ్ లు చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సేకరించాయి.
సంస్థ తాజా పెట్టుబడిలో $8 బిలియన్లను ఆకర్షించింది. నాలుగు ఫ్లాగ్ షిప్ ఫండ్లలో మూడు విస్తృత శ్రేణి మార్జిన్ లతో బెంచ్ మార్క్ ఇండెక్స్ లను అధిగమించడం విశేషం. డిసెంబర్ , 2016లో ప్రారంభమైనప్పటి నుండి ఫండ్ ఏడాదికి 10 .8 శాతానికి లాభ పడింది. 3.9 వార్షిక రాబడి కంటే ఎక్కువ కావడం విశేషం.
డబ్బులు ఊరికే రావు. కానీ పద్దతి ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే వాటంతట అవే తమ విలువను పెంచుకుంటాయి. మిగతా గ్రోత్ మేనేజర్ల కంటే చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇవాళ మోస్ట్ పాపులర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు.
Also Read : గూగుల్ వేటు కొత్త కంపెనీ స్టార్ట్