Harman Preet Kaur : హర్మన్ ప్రీత్ కౌర్ కంటతడి
కన్నీళ్లు కనిపించ కూడదనే కళ్లద్దాలు
Harman Preet Kaur Emotional : దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐసీసీ మహిళా టి20 వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ లో భారత మహిళా జట్టు హోరా హోరీగా పోరాడింది. కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
ఓ వైపు జ్వరం ఉన్నా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది. కానీ చివరి వరకు నిలవలేక పోయింది. మంచి ఊపు మీదున్న సమయంలో ఉన్నట్టుండి రనౌట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా చేజారి పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కంటతడి(Harman Preet Kaur Emotional) పెట్టింది. ఆమె తట్టుకోలేక పోయింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అవును నేను ఏడుస్తున్నాను. కానీ నా కన్నీళ్లను ఈ దేశానికి కనిపించకుండా ఉండాలని కళ్లద్దాలను ధరించానని చెప్పింది. ఇవాళ మరోసారి వాగ్ధానం చేస్తున్నాను.
ఇంతకంటే మరింత మెరుగైన రీతిలో ప్రదర్శన చేపడతామని స్పష్టం చేసింది హర్మన్ ప్రీత్ కౌర్. మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రాను ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంజుమ్ భారత కెప్టెన్ ను చాలా సేపు పట్టుకున్నప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ కళ్లల్లో నీళ్లు ప్రవహించాయి. హర్లీన్ డియోల్ సైతం కన్నీళ్లను దాచుకునే ప్రయత్నం చేసింది.
Also Read : పోరాడి ఓడిన టీమిండియా