Harman Preet Kaur : మీ రుణం తీర్చుకోలేను – కౌర్

అభిమానానికి ధ‌న్య‌వాదాలు

Harman Preet Kaur T20 : భార‌త మ‌హిళా జ‌ట్టు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆమె సార‌థ్యంలో భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ దాకా చేరుకుంది. బ‌లమైన ఆస్ట్రేలియా జ‌ట్టుతో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో కేవ‌లం 5 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడింది. హాఫ్ సెంచ‌రీ ఆక‌ట్టుకుంది. కానీ ర‌నౌట్ కావ‌డంతో కీల‌క‌మైన మ్యాచ్ ను భార‌త్ కోల్పోయింది. ఈ త‌రుణంలో క‌న్నీళ్లు పెట్టుకుంది. ఫ్యాన్స్ తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. 

జ‌స్ట్ హర్మ‌న్ ప్రీత్ కౌర్ గ‌నుక క్రీజులో ఉండి ఉంటే టీమిండియా క‌చ్చితంగా గెలిచి ఉండేద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మైంది. ఈ ర‌నౌటే కొంప ముంచింద‌ని వాపోయారు. భార‌త్ ఓడి పోయినా అభిమానుల హృద‌యాల‌ను గెలుచుకుంది. అంతే కాదు కెప్టెన్ గా కౌర్(Harman Preet Kaur T20) ను ఆకాశానికి ఎత్తేశారు ఫ్యాన్స్. ఆమెకు అండ‌గా నిలిచారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది భార‌త జ‌ట్టు కెప్టెన్. టోర్నీలో త‌మ‌కు స‌పోర్ట్ గా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. మీ రుణం ఎన్న‌టికీ తీర్చు కోలేన‌ని పేర్కొంది. మా ప్ర‌యాణం ఇప్ప‌టితో ముగియ లేద‌న్నారు. మేం తిరిగి వ‌స్తాం..మ‌ళ్లీ అద్భుతాన్ని సృష్టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్. ప్ర‌స్తుతం కౌర్ చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also Read : ప్ర‌తి గెలుపులోనూ నేనున్నా – కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!