Sania Mirza : సానియా మీర్జా కోచ్ గా రాణిస్తుందా
టెన్నిస్ నుంచి క్రికెట్ లోకి
Sania Mirza Coach RCB : ఎవరూ ఊహించని రీతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళల ప్రీమియర్ లీగ్ లో తమ జట్టు తరపున హెడ్ కోచ్ గా మెంటార్ గా ప్రముఖ టెన్నిస్ స్టార్ హైదరాబాదీ సానియా మీర్జా(Sania Mirza) నియమించింది. ఇక సానియా ఎలా రాణిస్తుందనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. సానియా అంటేనే టెన్నిస్. ఆమె ఎన్నో టైటిళ్లు గెలుపొందింది. టెన్నిస్ పరంగా భారత దేశానికి ఎనలేని పేరు తీసుకు వచ్చింది.
ఇటీవలే తాను ఇక ఆడలేనంటూ ప్రకటించింది. తాను టెన్నిస్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. అందరినీ విస్మయ పరిచేలా చేసింది. ఇదే క్రమంలో ఒక్క రోజు తేడాలోనే సానియా మీర్జాకు(Sania Mirza Coach RCB) కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం తెలిపింది. ఈసందర్భంగా సానియా కీలక ప్రకటన చేసింది. ఇది నా జీవితంలో అనుకోని అవకాశమని పేర్కొంది. టెన్నిస్ , క్రికెట్ రెండూ అద్భుతమైన ఆదరణ కలిగిన క్రీడలు అని ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయని స్పష్టం చేసింది.
ఇది సవాల్ తో కూడుకున్న కొత్త పదవి అని పేర్కొంది. తనకు క్రికెట్ తో కూడా అనుబంధం ఉందని తెలిపింది. ఎందుకంటే పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ ను సానియా మీర్జా పెళ్లి చేసుకుంది. వారిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. టెన్నిస్ లో రాణించిన ఆమె ఆర్సీబీ మహిళా జట్టును ఏ మేరకు రాణించేలా చేస్తుందనేది చూడాలి. ఈ జట్టుకు స్మృతీ మంధాన స్కిప్పర్ గా ఉంది.
Also Read : మీ రుణం తీర్చుకోలేను – కౌర్