TS Governor Serious CS : సీఎస్ ‘సుప్రీం’ అనుకుంటే ఎలా
గవర్నర్ తమిళిసై సీరియస్
TS Governor Serious CS : రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య మరోసారి వార్ మొదలైంది. నిన్నటి దాకా గవర్నర్ లేకుండానే బడ్జెట్ కానిచ్చేద్దామని అనుకున్న సీఎంకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మమ అనిపించారు. తాజాగా సీఎస్ గా కొలువు తీరిన శాంతి కుమారి తానేమీ తక్కువ కాదంటూ ఒంటెద్దు పోకడ పోతోందంటూ సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆరోపించడం కలకలం రేపింది. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు గవర్నర్(TS Governor).
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 10 ఫైళ్లను క్లియర్ చేయలేదంటూ సీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ గా నియమాకం అయిన తర్వాత మర్యాద పూర్వకంగా గవర్నర్ ను కలుసు కోవాలన్న ఇంకిత జ్ఞానం లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. తానే సుప్రీం అనుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పంపించిన ఫైళ్లు ఏమిటి. అవి ఎందుకు సంబంధించినవి. ఎందుకని ఆగి పోయాయని ఆమెకు తెలియదా అని నిలదీసింది.
సీఎస్ కు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సమయం చిక్కింది కానీ పక్కనే నాలుగు అడుగుల దూరంలో ఉన్న రాజ్ భవన్ కనిపించ లేదా అని ఫైర్ అయ్యింది తమిళి సై సౌందర రాజన్(TS Governor Serious CS). ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరు సుప్రీం కారని కానీ గవర్నర్ కు సీఎస్ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందన్న విషయం మరిచిపోతే ఎలా అని స్పష్టం చేసింది. మొత్తంగా గవర్నర్ దెబ్బ అబ్బా అనిపించేలా చేసింది. మరి సీఎస్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read : ఏపీ రాజధానిపై సీఎం ప్రకటన