Dr Priyanka Reddy DNA : వైద్య రంగంలో ప్రియాంకా రెడ్డి టాప్
ప్రముఖ చర్మవ్యాధి వైద్యురాలిగా గుర్తింపు
Dr Priyanka Reddy DNA : ఐటీకి కేరాఫ్ గా మారిన బెంగళూరు మహా నగరంలో డాక్టర్ ప్రియాంక రెడ్డి అంటే ఎవరైనా సరే ఠక్కున సమాధానం చెబుతారు. అంతలా పేరు పొందారు. చర్మ వ్యాధుల నివారణలో ఆమె మోస్ట్ పాపులర్ వైద్యురాలిగా గుర్తింపు పొందారు. అంతే కాదు డీఎన్ఏ స్కిన్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు.
వేలాది మందికి చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేలా చేశారు. చర్మ వ్యాధి నివారణ రంగంలో వైద్యురాలిగా 12 ఏళ్ల పాటుగా సేవలు అందిస్తూ వస్తున్నారు. డీఎన్ఏ స్కిన్ క్లినిక్ కళ్యాణ్ నగర్ లో ఉంది.
ఎక్కడి నుంచైనా ఆమె పేరు చెబితే చాలు తన క్లినిక్ కు తీసుకు వెళతారు. అంతగా పాపులర్ అయ్యారు ఆమె. చర్మ వ్యాధుల నివారణకే కాదు వెల్ నెస్ సెంటర్ ను కూడా నడుపుతున్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి(Dr Priyanka Reddy DNA). ఆమె ఎండీ కోర్సు పూర్తి చేశాక యుఎస్ కు వెళ్లారు.
అక్కడ అనుభవం కలిగిన వైద్యుల వద్ద కాస్మోటలజీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. లేజర్ టెక్నాలజీలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. సౌందర్యం పట్ల శ్రద్ద తనను వైద్యురాలిగా మారేలా చేసిందంటారు ఆమె.
ఆరోగ్య కరమైన చర్మం, శరీరం , మనస్సుకు సంపూర్ణమైన విశ్వాసాన్ని అందజేస్తుందని నమ్ముతారు ప్రియాంక రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా డెర్మటాలజిస్ట్ లకు విపరీతమైన ఆదరణ ఉందని తెలిపారు. గతంలో దీని పట్ల అవగాహన లేక పోవడం ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఒకరి వద్ద పని చేయడం కంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం, నా సంస్థకు నేనే యజమానిగా ఉండాలని కోరుకున్నానని స్పష్టం చేశారు ప్రియాంకా రెడ్డి. ఎక్కడా పని చేయలేదు. వైద్య పరిజ్ఞానం, బలంగా పని చేయగలనన్న నమ్మకం, కష్ట పడే స్వభావం తనను వైద్యురాలిగా పేరొందేలా చేసిందంటారు.
ఇన్నేళ్ల కాలంలో ఎన్నో హెచ్చులు తగ్గులు ఉన్నాయి. కానీ వాటిని నేను సమంగా చూశానని, అందుకే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానంటోంది డాక్టర్ ప్రియాంకా రెడ్డి(Dr Priyanka Reddy).